27 June, 2026 | 7:43 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

పరిమితికి మించి ప్రజలను తరలిస్తున్న ఆరు వాహనాల సీజ్

26-04-2025 12:00 AM

సరుకులు తరలించే వాహనాల్లో ప్రజల ప్రయాణం

ఆదిలాబాద్, ఏప్రిల్ 25 (విజయ క్రాంతి) : రుకులను తరలించే వాహనాల్లో ప్రజలను తరలిస్తున్న వాహనాలపై ఆర్టీఏ అధికారులు కొరడా జూలిపిస్తున్నారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో  విస్తృ త తనిఖీలు నిర్వహించారు. ఈ  క్రమంలో సరకులు తరలించే వాహనాలలో ప్రజలని పరిమితికి మించి తీసుకువెళ్తున్న 6 వాహనాలను సీజ్ చేసినట్లు ఆర్టిఏ అధికారి రవీందర్ కుమార్ తెలిపారు.

వాహనాలలో ప్రయాణిస్తున్న ప్రజలకి ప్ర మాదాలపై అవగాహన కల్పించడం జరిగింది. వాహన యజమానులు సరకు రవా ణా వాహనాలలో ప్రజలను తరలించినట్టయితే చట్ట రీత్యా చర్యలు తీసుకొంటమన్నారు. ప్రజలు సైతం సురక్షితమైన రవాణాను ఎంచుకోవాలని కోరారు. ఇలంటూ వాహనాల్లో ప్రయాణం చేయమని వాహన యజమానులకు డ్రైవర్లు ప్రజల చెప్పాలని కోరారు.

ప్రజా రవాణా వాహనాలలో సైతం పరిమితికి మించి ప్రయాణించరాదని సూచించారు. ఒకవేళ తనిఖీ అధికారులు అలాంటి వాహనాలను ఆపి సీజ్ చేసేటప్పుడు దానిలో ప్రయనిస్తున్న ప్రజలు అధికారులని అడ్డుకోకుండా, సహాయరించాలని కొరారు.