calender_icon.png 22 October, 2025 | 3:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాగ్రత్తలతోనే చర్మ సంరక్షణ

19-10-2025 12:28:59 AM

దీపావళి వేళ అప్రమత్తత అవసరం

జాగ్రత్తలతోనే చర్మ సంరక్షణ సాధ్యం. ప్రస్తుతం దీపావళి పండుగ ఆనందం, వెలుగులు, కలిసికట్టుగా జరుపుకునే సమయం. కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి, ప్రమాదాల బారీన పడకుండా చూసుకోవాలి. అయితే, పటాకులు, కాలుష్యం, హెవీ మేకప్, వాతావరణ మార్పులు వంటి కారణాల వల్ల చర్మం పలు రకాల ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో కామినేని హాస్పిటల్స్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్టు డాక్టర్ దీపికా జె సన్బాల్.. ప్రజలు తమ చర్మాన్ని రక్షించుకునేందుకు కొన్ని సరళమైన ముందు జాగ్రత్తలను పంచుకున్నారు.

ప్రతి ఏడాది దీపావళి సమయంలో కాలిన గాయాలు, చర్మ అలర్జీలు, కాలుష్యంతో సంబంధించిన చర్మ సమస్యలు పెరుగుతుంటాయి. కొన్ని చిన్న జాగ్రత్తలు పెద్ద సమస్యలను నివారించగలం. దీపావళి టపాకాయలు ఉపయోగించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

టపాకాయలు కాల్చేటప్పుడు చేతులకు రక్షణగా గ్లవ్స్ వాడటం, దగ్గరలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంచుకోవడం, పొరపాటున గాయం జరిగినా చల్లటి నీటితో కడిగి బర్న్ క్రీమ్ రాయడం వంటి జాగ్రత్తలతో మనం గాయాల బారిన పడకుండా లేదా తీవ్రతను తగ్గించవచ్చు. టూత్‌పేస్ట్ లేదా నూనె వంటి వాటిని వాడొద్దు. ఇవి గాయాన్ని మరింత తీవ్రం చేయవచ్చు. కొత్త బట్టలు లేదా కాస్మెటిక్స్ వాడటం వల్ల చర్మంపై దురద, దద్దుర్లు రావచ్చు. కాటన్ బట్టలు ధరించండి. 

చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి

సింథటిక్ మెటీరియల్స్‌కు వీలైనంతవరకు దూరంగా ఉంచండి. సాధారణంగా మీరు వాడే స్కిన్ కేర్ ఉత్పత్తులనే ఉపయోగించండి. పటాకులు కాల్చిన తర్వాత చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. దీపావళి సమయంలో గాలిలో కాలుష్యం అధికమవుతుందనే దృష్ట్యా, మంచి మాయిశ్చరైజర్, మైల్ క్లీన్సర్ వాడాలి. మొటిమలు లేదా సెన్సిటివ్ చర్మం ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ పొగ ఉన్న ప్రదేశాల్లో మాస్క్ ధరించండి. 

ఆహారం, హైడ్రేషన్ 

పండుగల వేళ తినే ఆహారం ఎక్కువగా ఆయిల్, చక్కెరతో ఉంటుంది. ఇవి మొటిమలను ప్రేరేపించవచ్చు. కాబట్టి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. తగినంత నీరు తాగాలి. దీర్ఘకాలిక చర్మ సమస్యలు (ఎగ్జిమా, సోరియాసిస్ మొదలైనవి) ఉన్నవారు వైద్యులు సూచించిన మందులు, చికిత్సలను కొనసాగించాలి. ఉత్సవం ఆనందంగా జరుపుకోవాలి. కానీ చర్మ ఆరోగ్యాన్ని త్యజించకూడదు. కొంత జాగ్రత్తతో ప్రతి ఒక్కరూ కాంతివంతమైన, సురక్షితమైన దీపావళిని జరుపుకోవచ్చు