19-10-2025 12:31:18 AM
మూత్రనాళాన్ని పునర్నిర్మించి, యువకుడిని కాపాడిన ఏఐఎన్‌యూ వైద్యులు
సంక్లిష్టమైన యూరాలజీ శస్త్రచికిత్సలు చేయడంలో పేరెన్నికగన్న ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు 38 ఏళ్ల నేపాలీ యువకుడికి పాడైన మూత్రనాళాన్ని అతడి నోటి చర్మంతో పునర్నిర్మించి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. తీవ్రమైన యూరాలజీ సమస్యలున్న యువతకు అత్యాధునిక మినిమల్లీ ఇన్వేజివ్, పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు చేయడంలో ఆస్పత్రి నిబద్ధతను ఈ విజయం మరోసారి చాటిచెప్పింది.
కిడ్నీల నుంచి మూత్రకోశానికి మూత్రాన్ని తీసుకెళ్లే మూత్రనాళాలు చాలా సన్నగా ఉంటాయి. అవి దెబ్బతింటే వాటికి మరమ్మతులు చేయడంగానీ, పునర్నిర్మించడంగానీ చాలా కష్టం అవుతుంది. అయితే, నోట్లో ఉండే చర్మం (బకల్ మ్యుకోసా) పొరను ఉపయోగించి నేపాలీ యువకుడికి మూత్రనాళాన్ని పునర్నిర్మించి అతడికి ప్రాణదానం చేశారు ఏఐఎన్యూ వైద్యులు.
చిన్నతనంలోనే కిడ్నీ సమస్య
నేపాల్‌కు చెందిన రోగికి చిన్నతనంలోనే కిడ్నీ సమస్య రావడంతో ఒక కిడ్నీ బాగా చిన్నగా అయిపోయింది. చాలాకాలం నుంచి ఒక కిడ్నీతోనే ఉంటున్నారు. ఇటీవల ఆ కిడ్నీ నుంచి వెళ్లే మూత్రనాళం పైభాగంలో రాళ్లు ఏర్పడటంతో తమ స్వదేశంలో చికిత్స కోసం వెళ్లారు. అక్కడ ఆయనకు లేజర్ పరిజ్ఞానంతో రాళ్లు పగలగొట్టి తీశారు. అయితే దురదృష్టవశాత్తు ఆ సమయంలో మూత్రనాళం కొంత దెబ్బతింది.
అసలే సన్నగా ఉండే మూత్రనాళం మరింత సన్నగా అయిపోయింది. దాంతో మూత్రవిసర్జనకు సంబంధించిన సమస్యలు తలెత్తి అక్కడి నుంచి భారత్‌కు పంపారు. ఇక్కడ ఏఐఎన్యూ ఆస్పత్రిలో ఆయన్ను పరీక్షించి, నోటి చర్మంతో మూత్రనాళ పునర్నిర్మాణం చేశాం. అది సన్నటి పొరలా ఉంటుంది. దెబ్బతిన్న మూత్రనాళం దగ్గర దాన్ని అతికించినప్పుడు చుట్టూ అతుక్కుపోయి.. ట్యూబుకు పంక్చర్ వేసినట్లుగా దాన్ని సరిచేస్తాం. ఇదంతా చాలా సంక్లిష్టమైన ప్రక్రియ.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు చాలావరకు లైంగికంగా వ్యాపిస్తాయి. దానివల్ల మూత్రమార్గం (యూరేత్రా) కొంత దెబ్బతింటుంది. అలా అయినప్పుడు దాన్ని సరిచేయడానికి మేం నోటి చర్మం పొరను ఉపయోగించేవాళ్లం. అయితే, దాన్ని ఇప్పుడు మూత్రనాళం పునర్నిర్మాణానికి ఉపయోగించడం అనేది మాత్రం పూర్తిగా కొత్త విధానం. దీనంతటినీ సాధారణంగా ఓపెన్ పద్ధతిలో చేస్తారు. కానీ మేం లాప్రోస్కోపిక్ లేదా రోబోటిక్ పద్ధతుల్లో చేస్తున్నాం.
బకల్ మ్యుకోసా: అంటే నోటిలోపల ఉండే చర్మం పొర అనేది సాధారణంగా మనం తినే ఆహారాన్ని తినడానికి, నమలడానికి, రుచి చూడడానికి ఉపయోగపడుతుంది. అలాంటిదాన్ని గతంలో మూత్రమార్గం పునర్నిర్మాణానికి, ఇప్పుడు మూత్రనాళాల పునర్నిర్మాణానికి కూడా ఉపయోగిస్తున్నాం.
మూత్రమార్గం, మూత్రనాళం రెండూ వేర్వేరు. మూత్రనాళాలు కిడ్నీల నుంచి మూత్రాన్ని బ్లాడర్కు (మూత్రకోశానికి) తీసుకెళ్తాయి. మూత్రమార్గం అనేది మూత్రకోశం నుంచి శరీరం బయటకు మూత్రాన్ని తీసుకెళ్తుంది.
లేజర్‌ను వాడే క్రమంలో జాగ్రత్తలు
టెక్నాలజీ అనేది ఎప్పుడూ వరంలాగే ఉంటుంది. లేజర్ రాక ముందు, వచ్చిన తర్వాత కిడ్నీల్లో రాళ్ల తొలగింపు ప్రక్రియ చాలా మారింది. చాలామంది వైద్యులు రోగులకు ఇబ్బంది లేకుండా ఉండాలని లేజర్ పరిజ్ఞానం వాడదామని సూచిస్తారు. రోగులు కూడా ఇదే మంచిదని దీనికి ప్రాధాన్యం ఇస్తారు. అంతవరకు బాగానే ఉంటుంది. అయితే, లేజర్‌ను వాడే క్రమంలో కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా పాటించాలి.
అలాగే దాన్ని సమర్థంగా ఉపయోగించుకోవాలి. మూత్రమార్గం (యూరేత్రా) పునర్నర్మాణం కొంతవరకు పర్వాలేదు. అది బ్లాడర్ నుంచి బయటకు మూత్రాన్ని తీసుకెళ్తుంది. మూత్రనాళాలతో (యూరేటర్) పోలిస్తే ఇది కొంత పెద్దగానే ఉంటుంది కాబట్టి దాని మరమ్మతులు చేయగలం. కానీ మూత్రనాళాలకు పునర్నిర్మాణం చేయడం సవాలుగా మారుతోంది. ఇప్పుడు నోటి చర్మం పొర ఉపయోగంతో దీన్ని కూడా అధిగమించగలుగుతున్నాం.
నాలుగు నగరాల్లో ఏడు అత్యాధునిక ఆస్పత్రులు
ఏఐఎన్యూ అనేది యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన, దేశంలోని ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నెట్‌వర్క్ అయిన ఏషియా హెల్త్‌కేర్ హోల్డింగ్స్‌లో భాగం. నాలుగు నగరాల్లో ఏడు అత్యాధునిక ఆస్పత్రులతో ఏఐఎన్యూ అంతర్జాతీయ స్థాయి కిడ్నీ, యూరాలజీ చికిత్సలు అందించడంలో ముందంజలో ఉంది. ఏఐఎన్యూలో అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
అవి.. యూరాలజీ రోబోటిక్ సర్జరీ, యూరో-ఆంకాలజీ, రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ, నెఫ్రాలజీ, కిడ్నీ మార్పిడి, డయాలసిస్, మహిళల యూరాలజీ, పీడియాట్రిక్ యూరాలజీ, పురుషుల ఆరోగ్యం, ఆండ్రాలజీ. భారతదేశంలో యూరలాజికల్ శస్త్రచికిత్సలలో అగ్రగామి అయిన ఏఐఎన్యూ ఇప్పటివరకు 5 లక్షల మందికి పైగా రోగులకు చికిత్సలు అందించి, 1400కు పైగా రోబోటిక్ శస్త్రచికిత్సలు చేసింది.
ఈ ఆస్పత్రిలో 500కు పైగా పడకలున్నాయి. ఎన్‌ఏబీహెచ్ అక్రెడిటేషన్‌తో పాటు డీఎన్బీ, ఎఫ్‌ఎన్బీ లాంటి పీజీ శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడానికి కూడా గుర్తింపు పొందింది. ప్రత్యేక చికిత్సలు, ఆవిష్కరణల విషయంలో ఏఐఎన్యూ ఎప్పుడూ ప్రమాణాలను పునర్నిర్వచిస్తోంది.