8 March, 2026 | 3:46 PM

Breaking News

ఆన్‌లైన్ పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రులు   •   ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష   •   అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •  

ఎయిర్‌వే అండ్ బ్రీతింగ్‌పై వర్క్‌షాప్

19-10-2025 12:27 AM

కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, అక్టోబర్ 18(విజయక్రాంతి): అత్యవసర మరియు క్లిష్టమైన వైద్య సంరక్షణలో కీలక నైపుణ్యాలను వైద్యులకు అందించి, వారిని మరింత శక్తివంతం చేయాలనే లక్ష్యంతో కేర్ హాస్పిటల్స్, బంజారాహి ల్స్, సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇం డియా సహకారంతో బేసిక్స్ టు అడ్వాన్సెస్ ఇన్ ఎయిర్వే అండ్ బ్రీతింగ్ వర్క్‌షాప్‌ను నిర్వహించింది.

ప్రాణాలను కాపాడే ఈ కార్యక్రమం ద్వారా వైద్యులు మరియు ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఎయిర్‌వే నిర్వహణ, శ్వాసకోశ మద్దతు వంటి అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన కీలక నైపుణ్యాలను అభ్యసించారు.ప్రాణాపాయ పరిస్థితుల్లో రోగుల వాయుమార్గం, శ్వాస నిర్వహణలో తాజా పద్ధతులు, ప్రొటోకాల్స్‌పై అవగాహన కల్పించడమే ఈ వర్క్‌షాప్ లక్ష్యం.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ విశాల్ మహేశ్వరి మాట్లాడుతూ ఇలాంటి నైపుణ్య ఆధారిత శిక్షణా కార్యక్రమాలు ఈ సమయంలో చా లా అవసరమన్నారు. ప్రతి సెకను విలువైనప్పుడు, శిక్షణ పొందిన చేతులు, స్పష్టమైన విధానాలు మాత్రమే ప్రాణాలను కాపాడగలవు. భారతదేశంలో ఆరోగ్య సిబ్బందిలో క్లినికల్ విశ్వాసాన్ని పెంపొందించడంలో కేర్ హాస్పిటల్స్ తీసుకున్న ఈ అడుగు ఎంతో ప్రశంసనీయం అని తెలిపారు.

కేర్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం జోనల్ హెచ్‌వోడీ, అసోసియేట్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ కిరణ్ కుమార్ వర్మ మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ఖచ్చితంగా, వేగంగా స్పందించడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పారు.కేర్ హాస్పిటల్స్ జోనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిజు నాయర్ మాట్లాడుతూ, మేము కేవలం క్లినికల్ ఎక్సలెన్స్‌కే ప్రాధాన్యత ఇవ్వం, ప్రతి వైద్యుడు సమయానికి సరైన నిర్ణయంతో సేవలు అందించగలిగే విధంగా వ్యవస్థలను నిర్మించడమే మా లక్ష్యం అని అన్నారు.