07-11-2025 12:00:00 AM
గతేడాదితో పోలిస్తే 12.69 శాతం తగ్గుదల
ముంబై, నవంబర్ 6: ఎన్‌సీసీ లిమిటెడ్.. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికం ఫలితాలను గురువారం విడుదల చేసింది. జూలై -సెప్టెంబరు త్రైమాసికానికి గాను కంపెనీ ఏకీకృత ఆదాయం రూ.4,585.06 కోట్లు అని పేర్కొంది. కాగా గతేడాది ఇది రూ. 5224.36 కోట్లు ఉంది. దీంతో రెండో త్రైమాసికంలో 12.69 శాతం తగ్గుదల నమోదైంది. ఇదే సమయంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏకంగా రెండింతలు వృద్ధితో లాభాల వాటా రూ.154.70 కోట్లకు చేరుకుంది.
ఇక ఈ త్రైమాసికంలో నికర లాభం రూ. 100.96 కోట్లు ఉండగా.. గత ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ. 160.55 కోట్లుగా ఉంది. ఈ లెక్కన రూ. 59.59 కో ట్లు నష్టంగా అంచనా వేసింది. సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ కొత్తగా రూ.6223 కోట్ల విలువైన ఆర్డర్లను చేజిక్కించుకోవటంతో సెప్టెంబర్ 30, 2025 నాటికి మొత్తం ఆర్డర్ బుక్ రూ.71,957 కోట్లకు చేరుకున్నట్లయింది.