calender_icon.png 6 November, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మినార్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ చెఫ్ సంజయ్ తుమ్మా

05-11-2025 11:27:47 PM

హైదరాబాద్: హైదరాబాద్ కు చెందిన సెలబ్రిటీ చెఫ్ సంజయ్ తుమ్మాకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. వహ్ చెఫ్ గా పేరున్న సంజయ్ తుమ్మాను మినార్ తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. డిస్ట్రిక్ట్ 150లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ఈ ఒప్పందాన్ని ప్రకటించింది. తెలంగాణలో అతిపెద్ద ప్రీమియం పిండి తయారీదారీగా ఉన్న శ్రీ సాయి రోలర్ ఫ్లోర్ మిల్ ప్రైవేట్ లిమిటెడ్ మినార్ బ్రాండ్ పేరుతో ఉత్పత్తులను అందిస్తోంది.

నగరంలో ఉన్న పలు ప్రముఖ బేకరీ కంపెనీలు, సూపర్ మార్కెట్లకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్న తాము ఇప్పుడు సెలబ్రిటీ చెఫ్ సంజయ్ తుమ్మాతో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందని మినార్ డైరెక్టర్ ఆదిత్య బన్సాల్ చెప్పారు. క్వాలిటీతో కూడిన ప్రోడక్టులకే తాను ప్రాాధాన్యత ఇస్తానని, బ్రాండ్ అంబాసిడర్ గా అంగీకరించే ముందు కంపెనీ టర్నోవర్ కంటే దానికున్న ఆదరణనే చూస్తానని చెఫ్ సంజయ్ తుమ్మా చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో ప్రముఖ బేకరీలకు, పెద్ద సూపర్ మార్కెట్లను సుదీర్ఘకాలంగా క్లైంట్లుగా మార్చుకున్న మినార్ లాంటి సంస్థ కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పారు. మినార్ కు చెందిన ప్రధాన ప్లాంట్లను తాను దగ్గరుండి చూసానని, క్వాలిటీకి వీరు అత్యంత ప్రాధాన్యతనిస్తారని తెలిపారు.