27 June, 2026 | 7:42 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

సజావుగా ఐసెట్

09-06-2025 02:38 AM
  1. తొలిరోజు రెండు విడతల పరీక్షకు 90% హాజరు
  2. ఐసెట్ కన్వీనర్ ప్రొ.అలువాల రవి

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): ఎంబీఏ, ఎంసీఏ అడ్మిషన్ల కోసం నిర్వహించే తెలంగాణ ఐసెట్-2025 తొలిరోజు రెండు విడతల పరీక్షను సజావుగా నిర్వహించినట్టు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ అలువాల రవి తెలిపారు. మొదటి విడత ప్రశ్నపత్రాల సెట్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్ ప్రొ.ఇటికాల పురుషోత్తం, ప్రొ.మహమూద్, సెక్రటరీ శ్రీరా మ్ వెంకటేశ్, ఐసెట్ చైర్మన్ ప్రొ. హుస్సేన్‌లతో కలిసి అలువాల రవి విడుదల చేశారు.

ఈ సందర్భంగా ప్రొ.బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. ఎంజీయూ అనతికాలంలోనే రాష్ట్ర స్థాయి కామన్ ఎంట్రన్స్‌లను నిర్వహించే సామర్థ్యం పొందడం హర్షించదగ్గ విషయమన్నారు. అభ్యర్థులకు, యాజమాన్యం రీత్యా అత్యంత పారదర్శకంగా, సులువుగా నిర్వహించేందుకు అధునాతన సాంకేతికతను వినియో గించడాన్ని అభినందించారు.

మొత్తం మూడు విడతల్లో నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్షలను ఉద యం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు 93 పరీక్షా కేంద్రాల్లో, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వర కు 91 పరీక్షా కేంద్రాల్లో రెండు విడతలుగా నిర్వహించారు. మొదటి విడత 24,330 మంది అభ్యర్థులకుగానూ 21,897(90%) హాజరుకాగా, మధ్యాహ్నం 24,330 మందికి గానూ 22,136(90.98%) హాజరైనట్టు రవి వెల్లడించారు.