9 August, 2026 | 1:31 AM

తెగిపడ్డ ఓహెచ్‌ఈ లైన్

09-08-2026 12:00 AM

రైళ్ల రాకపోకలకు అంతరాయం 

కాజీపేట (మహబూబాబాద్) ఆగస్టు 8(విజయక్రాంతి): బల్హర్ష - కాజీపేట రైల్వే సెక్షన్ లో హసన్‌పర్తి రోడ్డు - కాజీపేట రైల్వేస్టేషన్ల మధ్య శనివారం ఉదయం ఓహెచ్‌ఈ విద్యుత్తు లైన్ తెగిపడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి రైళ్ల రాకపోకలకు గంటసేపు అంతరాయం కలిగింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల నాగపూర్ కాజీపేట మార్గంలో రైళ్లు నిలిచిపోయాయి. ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే రైల్వే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని తెగిపడ్డ విద్యుత్తు లైనుకు మరమ్మతు పనులు నిర్వహించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.