ఫిట్‌నెస్ లేని బస్సులెన్నో..!
- నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులు
- ఫిట్నెస్ లేకున్నా రోడ్లపైకి వాహనాలు
- నామమాత్రంగా రక్షణ చర్యలు
- మరో వారం రోజుల్లో తెరుచుకోనున్న పాఠశాలలు
మెదక్, జూన్ 8 (విజయ క్రాంతి) : మరో వారం రోజుల్లో పాఠశాలల ప్రారంభం కానున్నాయి. ఇంటికి సుదూరంగా ఉన్నా పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు మంచి పాఠశాలలను ఎంచుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా నిత్యం ఉదయం, సాయంత్రం వేళలో వారిని డ్రాప్ చేయడం, పికప్ చేసుకోవడంలాంటి వెసులుబాటు అందరికీ లేకపోవడంతో చాలా వరకు స్కూ ల్ బస్సులు, ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
జిల్లాలోని మెజా ర్టీ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అడ్మిషన్లు, ఫీజు వసూళ్లపై చూపిస్తున్న శ్రద్ధ.. బడి బస్సులపై చూపడంలేదనే ఆరోపణలున్నాయి. పాత వాహనాలకు కొత్తగా రంగులద్ది రోడ్లపై యథేచ్ఛగా తిప్పుతున్నా యి. తక్కువ వేతనానికి పనిచేసే ఎలాంటి అనుభవం, అర్హత లేని డ్రైవర్లను నియమించుకుని పిల్లల ప్రాణాలతో చెలగాట మాడుతున్నాయి.
ఫిట్నెస్లేని బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపించాల్సింది పో యి.. యాజమాన్యాలు ఇచ్చే మామూళ్లకు కక్కుర్తిపడి కండిషన్ సరిగ్గాలేని బస్సులకు సైతం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారన్న ఆరోపణలు పెద్దఎత్తున వినబడుతున్నాయి.
విద్యార్థుల భద్రతను గాలికొదిలేస్తున్న యాజమాన్యాలు..
విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల భద్రతను గాలికొదిలేస్తున్నాయి. ఫిట్నె స్లేని బస్సులు నడుపుతూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. విద్యా సంస్థల బస్సు ల్లో పిల్లల రక్షణకు సంబంధించి చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఫిట్నెస్ తనిఖీ సమయాల్లో నిబంధనలు పాటిస్తున్నప్పటికీ, ఆ తరువాత పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. జూన్ 15 నుంచి నూ తన విద్యాసంవత్సరం ప్రారంభం కానుం
డగా, ఆ లోపే విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్ ప్రక్రియ పూర్తి చేసుకోవలసి ఉంది. మూడు రోజులుగా ఆర్టీఏ అధికారులు బ స్సుల తనిఖీలు చేపడుతుండగా, యాజమాన్యాల నుంచి సరియైన స్పందన లభించడం లేదు. జిల్లావ్యాప్తంగా 256 విద్యాసంస్థల బస్సులు ఉండగా, ఇప్పటి వరకు కేవలం 220 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యా యి. ఫిట్నెస్ పరీక్షలకు వెళితే అధికారులు బ స్సులను సీజ్ చేస్తారేమోననే ఉద్దేశంతోనే వె నుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉం డగా పాత వాహనాలకు కొత్తగా రంగులద్ది రోడ్లపై యదేచ్ఛగా తిప్పుతున్నాయి. తక్కు వ వేతనానికి పని చేసే ఎలాంటి అ నుభవం, అర్హత లేని డ్రైవర్లను నియమించుకుని పిల్లల ప్రాణాలతో చెలగాట మాడుతున్నాయి.
ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో కానరాని పరికరాలు..
విద్యాసంస్థల బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బా క్సులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ అందులో ప్ర థమ చికిత్సకు సంబంధించి ఎలాంటి పరికరాలు ఉండటం లేదని తెలుస్తోంది. ఫస్ట్ ఎ యిడ్ బాక్సుల్లో తప్పనిసరిగా కాటన్, అ యోడిన్, స్పిరిట్ బాటిల్, బ్యాండేజ్ ఉండాలనే నిబంధన ఉంది. బస్సుల్లో తదితర వస్తు వులు ఉన్న ప్పటికీ అవి కాలం చెల్లి ఉండటం గమనార్హం. చిన్నచిన్న ప్రమాదాలు జరిగినప్పుడు విద్యార్థులకు ప్రథమ చికిత్స అందించేందుకు ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉపయోగపడతాయి. వీటితో పాటు విద్యార్ధులు బ్యాగులు పెట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి. డ్రైవరుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఫోటో పేరు, సెల్ నంబర్ విధిగా ప్రదర్శించాలనే నిబంధన ఉంది.
ఊసేలేని డ్రైవర్ల మెడికల్ సర్టిఫికెట్లు..
పాఠశాల బస్సుల్లో పనిచేసే డ్రైవర్లకు రెండు సంవత్సరాలకు ఒకసారి వైద్య చికిత్స లు చేయించి మెడికల్ సర్టిఫికెట్ అందుబాటులో ఉంచాలి. కాని ఈ విషయమై యాజ మాన్యాలు దృష్టి సారించడం లేదని సమాచారం. డ్రైవర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు యాజమాన్యాలు ధ్రువీకరించుకోవాల్సిన అ వసరం ఉంటుంది. అలాగే హెవీ డ్రైవింగ్ లై సెన్స్ కలిగి ఉండి ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న వారినే డ్రైవర్లుగా ని యమిం చుకోవాలనే నిబంధన కూడా ఉంది. లైట్లు, హ్యాండ్ బ్రేక్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్లు, పసుపుపచ్చ రంగు కలిగి ఉండాలి.
కఠిన చర్యలు తీసుకోవాలి
ఫిట్నెస్లేని బస్సులను నడుపుతూ.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రై వేటు స్కూల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి.
పాటించాల్సిన నిబంధనలు
15 ఏళ్లు నిండిన బస్సుల్లో పాఠశాల విద్యార్థులను తీసుకెళ్లడానికి వీలులేదు.
తప్పనిసరిగా ఐదేళ్ల అనుభవం ఉన్న వాళ్లనే డ్రైవర్లుగా నియమించుకోవాలి.
ప్రతి మూడు నెలలకోసారి కంటిచూపు, రక్తపోటు, మధుమేహ పరీక్షలు చేయించాలి. 60 ఏళ్లు నిండిన వాళ్లను డ్రైవర్లుగా నియమించరాదు. కచ్చితంగా ప్రాథమిక చికిత్స పెట్టె బస్సులో ఉంచాలి. అందులో కావాల్సిన మందులు ఎప్పటికప్పుడు సమకూర్చుకోవాలి.
పాఠశాల, కళాశాల పేరు, ఫోన్ నంబర్, పూర్తి చిరునామాను బస్సుకు ఎడమవైపు వెనుక భాగంలో కనిపించేలా రాయించాలి.
బస్సుకు కనీసం ఒక అటెండర్ను ఏర్పాటు చేయాలి. పిల్లలు ఎక్కేది, దిగేది డ్రైవర్కు స్పష్టంగా కనిపించేలా కుంభాకార అద్దాలు అమర్చాలి. లోపల ఒక పెద్ద పారదర్శక కుంభాకార అద్దం సైతం ఏర్పాటు చేయాలి. ఇంజిన్ కంపార్ట్మెంట్లో ఒక అగ్నిమాపక యంత్రం పొడి అందుబాటులో ఉంచాలి.
విద్యార్థులు తమ పుస్తకాల బ్యాగులను ఉంచుకునేలా ప్రత్యేక ర్యాక్లు ఏర్పాటు చేయాలి. ప్రతి విద్యాసంస్థ తాము కలిగిన పది బస్సులకు అదనంగా మరో బస్సును కూడా ఉంచుకోవాలి.
రక్షణ చర్యలో భాగంగా కిటికీల మధ్య లో ఇనుప కడ్డీలను అమర్చాలి.
ఫుట్బోర్డు పై మొదటి మెట్టు భూమికి 325 మిల్లీమీటర్ల ఎత్తుకు మించకుండా ఏర్పాటు చేసుకోవాలి.
అన్ని మెట్లు జారకుండా ఉండే లోహం తో నిర్మించాలి.
ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి..
జిల్లాలో సుమారు 256 బస్సులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు 220 బస్సులు ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయి. జూన్ 15 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం ఉన్నందున యాజమాన్యాలు స్పందించాలి. నిర్ణీత గడువులోగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోకుండా బస్సులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం..
శ్రీకాంత్ చక్రవర్తి
జిల్లా రవాణా శాఖ అధికారి






