calender_icon.png 9 September, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్షరాస్యత తోనే సమాజాభివృద్ధి

09-09-2025 08:38:28 AM

మందమర్రి,(విజయక్రాంతి): సంపూర్ణ అక్షరాస్యతతోనే సమాజం అభివృద్ధి సాధ్యమవుతుందని మండల పరిషత్ అభివృద్ధి(Mandal Parishad Development) అధికారి ఎన్ రాజేశ్వర్, మండల విద్యాధికారి దత్తుమూర్తిలు అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంను పురస్కరించుకొని జిల్లా వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులతో పాఠశాల నుండి పాలచెట్టు ప్రాంతం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు మహిళా విద్యాభివృద్ధి పై వ్యాసరచన, రంగోలి పోటీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని వారు స్పష్టం చేశారు. విద్యార్థులు నిరక్షరాస్యులైన వారి తల్లిదండ్రులకు వయోజన విద్య పథకం ద్వారా విద్య నేర్పించాలని తద్వారా తల్లిదండ్రులు విద్యావంతులుగా మారుతారన్నారు. విద్యావంతులైన తల్లిదండ్రుల ద్వారా వారి పిల్లలు ఉన్నత విద్యావంతులుగా ఎదుగుతారన్నారు. విద్యార్థులు వారి పరిసర ప్రాంతాల్లో నిరాక్షరాసులను  గుర్తించి వారికి విద్య నేర్పించాలని సూచించారు. జిల్లాలో కాసిపేట మండలం 100% అక్షరాస్యతతో మొదటి స్థానంలో ఉందని, మందమర్రి మండలంలో 100శాతం అక్షరాస్యత సాధించే విధంగా కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు సొత్కు సుదర్శన్, చిలగాని సుదర్శన్, పోలు శ్రీనివాస్, కొక్కుల మధు, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.