09-09-2025 08:35:32 AM
నాగార్జునసాగర్, విజయక్రాంతి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని హైదరాబాద్‌లోని మలక్‌పేట యశోద ఆసుపత్రిలో(Malakpet Yashoda Hospital) యువకుడికి మెరుగైన సాంకేతిక వైద్య చికిత్స అందించారు జ్ఞానంతో పూర్వస్థితికి తీసుకువచ్చి యధావిధిగా ఆ యువకుడు తన పనులు తను చేసుకునేలా చేసిన మలక్‌పేట యశోద ఆసుపత్రి వైద్య సిబ్బంది యువకుని తల్లిదండ్రులు వైద్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా సోమవారం నాగార్జునసాగర్ విజయ విహార్ అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశోద ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ హైదరాబాద్ మలక్ పేట్ యశోద ఆసుపత్రి వైద్య బృందం రోడ్డు ప్రమాదాలు ప్రాణాంతకమైన గాయాలకు దారితీస్తాయి.
ముఖ్యంగా, ఫీమోరల్ ఆర్టరీ చీలిపోవడం, తీవ్ర స్థాయిలో ఎముకలు విరగడం వంటి అత్యవసర పరిస్థితిలో సరైన వైద్య సేవలు అందించకపోతే రోగి ప్రాణాలు పోవచ్చు లేదా శాశ్వత అంగవైకల్యం సంభవించినప్పుడు అలాంటి సందర్భాల్లో ఎలాంటి జాప్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రదించాలని కోరారు. ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ముఖ్యమైనది, అనారోగ్య స్థితిలో ఉన్నవారికి హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతగానో తోడ్పడుతుందని నల్గొండ జిల్లా కొత్త పల్లి గ్రామానికి చెందిన 20 ఏళ్ల మోకరాల పవన్ ప్రాణాలను కాపా డటమే కాక, అతని కాలును కూడా రక్షించగలిగామని చెప్పారు. గత మే 25వ తేదీన నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని బుద్ధవనం వద్ద రోడ్డు ప్రమాదంలో రోగికి ఎడమ కాలు తొడ భాగంలో ఎముక విరగడంవల్ల ఫీమోరల్ ఎముక ఆర్టరీ చీలికవల్ల రక్తప్రసరణ ఆగి పోయి ప్రాణాంతక పరిస్థితి ఏర్పడింది. అందువలన అతని
కాలు దక్కడమే చాలా కష్టం. ఆ పరిస్థితిలో అతని కాలును యశోద వైద్యుల బృందం ద్వారా రక్షించాం. హైదరాబాద్ మలక్‌పట్ యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో ఉన్న ఆధునిక ట్రామా, వాస్క్యులర్, ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ సేవలు, క్రిటికల్ కేర్, సమగ్ర పునరావాస వైద్య సేవలకు, మలక్ పేట యశోద ఆసుపత్రి వైద్య బృందాలకు, నిబద్ధతకు అద్భు తంగా వ్యవహరించాం, ఆసుపత్రిలో మాత్రమే కాక యశోద అసు పత్రి అన్ని శాఖల్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యా ధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి, నిపుణులైన యశో దా వైద్య బృందం, అత్యంత క్లిష్టతరమైన జబ్బులు, వ్యాధులకు కూడా చికిత్స జరుగుతుండటంతో మలక్ పేట యశోదా హాస్పిటల్స్ డైరెక్టర్ గోరుకంటి పవన్, యూనిట్ కె.శ్రీనివాసరెడ్డి, జనరల్ మేనేజర్ శ్రీనివాస్ వాసుకిరణ్ రెడ్డి తెలిపారు.
యశోద వైద్యుల బృందానికి ధన్యవాదాలు: పవన్, రోగి
గత మే 25వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎడమ తొడ ఎముక విరగడం వల్ల ఫిమొరల్, ఆర్జరీ చిలికవల్ల రక్త ప్రసరణ ఆగిపోయి ప్రాణాంతక పరిస్థితి ఏర్పడిందని, అటువంటి స్థితిలో యశోద ఆసు పత్రి వైద్యులు ప్రత్యేక చొరవ తీసుకొని తిరిగి మామూలు మనిషిని ఇప్పుడు గతంలోలాగే నడవగలుగుతున్నానని యశోద ఆసుపత్రి వైద్యులకు, ఆసుపత్రి యజమానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.