14 March, 2026 | 11:36 AM

కాంగ్రెస్‌తో సామాజిక న్యాయం

15-06-2025 12:00 AM

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నదని, అన్ని పదవుల్లో బీసీలకు, సామాజిక న్యాయానికి ప్రాధాన్యత కల్పిస్తామని పీసీసీ అధ్యక్షడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. శనివారం గాంధీ భవన్‌లో మహేశ్‌కుమార్‌గౌడ్‌ను మంత్రి వాకిటి శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిశారు.

బీసీ బిడ్డ శ్రీహరికి మంత్రి పదవి రావడం హర్షణీయమని మహేశ్‌కుమార్ అన్నారు. కాగా మంత్రి పదవిని బాధ్యతగా నిర్వర్తిస్తానని వాకిటి శ్రీహరి అన్నారు. మంత్రిగా అవకాశం ఇచ్చిన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఖర్గే, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.