15 April, 2026 | 9:27 PM

రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి..

14-06-2025 11:51 PM

రక్తదానంపై అపోహలను విడనాడాలి...

ప్రపంచ రక్తదాతల దినోత్సవంలో జిల్లా కలెక్టర్...

అదిలాబాద్ (విజయక్రాంతి): ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఒకరికి రక్తదానం చేస్తే ప్రాణం కాపాడిన వారం అవుతామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా(District Collector Rajarshi Shah) అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవ సందర్భంగా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లను అందజేసి, అభినందించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిమ్స్ కళాశాల లోని బ్లడ్ బ్యాంక్ రక్తాన్ని సేకరించడంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని, అందుకు స్వచ్ఛంద సంస్థల కీలక పాత్ర ఎంతో ఉందని తెలిపారు. రక్తదానం అనేది అన్ని దానాల కంటే గొప్ప దానం అని అన్నారు. రక్తదానం చేస్తే అనారోగ్య పాలవుతామనే అపోహలను విడనాడాలన్నారు. ప్రమాదాల బారిన పడిన సమయంలో, అత్యవసర  పరిస్థితుల్లో రక్తదానం చేసి ప్రాణాలను నిలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్  జై సింగ్ రాథోడ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్,  ఆర్.ఎం.ఓ సాయి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కృష్ణ, అబ్దుల్ అజీజ్, రాజు, రామచంద్ర మహాత్మా, శశికళ చౌహన్, హేమావతి, సత్యం, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.