సోషల్ వెల్ఫేర్ చిల్కూర్ గురుకులానికి 100 శాతం ఫలితాలు
కళాశాల ప్రిన్సిపాల్ ఎం. శౌరిరాజ్
మొయినాబాద్ ఏప్రిల్ 12 (విజయక్రాంతి): సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల మరియు కళాశాల, చిల్కూర్ ఇంటర్ 2026 ఫలితాల్లో అద్భుత విజయాన్ని సాధించింది. విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. MPC ద్వితీయ సంవత్సరం ఫలితాలు:MPC 2వ సంవత్సరం విద్యార్థులందరూ ఉత్తీర్ణులై 100 శాతం ఫలితాన్ని నమోదు చేశారు.
మొత్తం 37 మందిలో 37 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ విభాగంలో U. అనిల్ కుమార్ 984 మార్కులతో టాపర్గా నిలవగా, P. భరత్ కుమార్ 982 మార్కులతో ద్వితీయ స్థానం పొందారు. BPC ద్వితీయ సంవత్సరం ఫలితాలు:BPC 2వ సంవత్సరం విద్యార్థులూ 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 51 మందిలో 51 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఈ విభాగంలో G.శ్రీనివాస్ 990 మార్కులతో మొదటి స్థానం, ౄ. చరణ్ 986 మార్కులతో రెండో స్థానం పొందారు. BPC ప్రథమ సంవత్సరం ఫలితాలు: BPC 1వ సంవత్సరం ఫలితాల్లో 116 మందిలో 106 మంది ఉత్తీర్ణులై 91 శాతం ఫలితాన్ని నమోదు చేశారు. ఈ విభాగంలో B. సంతోష్ కుమార్ 437 మార్కులతో టాపర్గా నిలిచారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ M. శౌరిరాజ్ మాట్లాడుతూ, విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల శ్రమ, తల్లిదండ్రుల సహకారంతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలను కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.




