15 May, 2026 | 2:51 AM

ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలి

15-05-2026 01:20 AM

పీఎం సూర్యగర్ యోజన అవగాహన కార్యక్రమంలో వక్తలు

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా మేనేజర్ టీజీ రెడ్కో గందం రాజేందర్ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగంలో భాగంగా కేంద్ర తెచ్చిన పీఎం సూర్యగర్ యోజనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా గందం రాజేందర్ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం తమ ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకొని సూర్యశక్తిని విద్యుత్ శక్తిగా మార్పిడి చేసుకుని స్వయంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అం దిస్తున్న పీఎం సూర్యగర్ యోజన కింద కిలోవాట్‌కు రూ.30 వేలు, 2 కిలోవాట్లకు రూ.60 వేలు, 3 కిలోవాట్లకు రూ.70 వేల వరకు సబ్సిడీ అందిస్తున్నట్లు వివరించారు.

అలాగే పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులు తమ వ్యవసాయ భూముల్లో సోలార్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని స్థిరమైన ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు వ్య యంలో 85%, సబ్సిడీ, బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తాయని మిగిలిన 15% మాత్రమే వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుందని తెలియజేసినారు. 3.5 నుంచి 4 ఎకరాల భూమి అవసరమవుతుందని, ఆ భూమి సమీప సబ్‌స్టేషన్‌కు 5 కిలోమీటర్ల పరిధిలో ఉండాలని చెప్పారు.

ఒక మెగావాట్ ప్లాంట్ ఏర్పాటు వ్యయం సుమారు రూ.3.5 కోట్ల వరకు ఉంటుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తి అయ్యే విద్యుత్ను 25 సంవత్సరాల పాటు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటోం దని, రుణ సదుపాయాలు కూడా కల్పించబడనున్నాయని తెలిపారు.

ఈ పథకం ద్వారా రైతులు సంవత్సరానికి సుమారు రూ.50 లక్షల నుంచి రూ.52 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. పీఎం కుసుమ్ రెండో విడత మార్గదర్శకాలు విడుదలైన వెంటనే రైతులు దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బొమ్మినేని రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతము వాతావరణంలో ఏర్పడుతున్న తీవ్ర మార్పుల వలన ఉష్ణోగ్రతలు పెరిగి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

దీనిని నిరోధించడానికి ప్రతి ఒక్క రూ తమకు వీలైనంత అనుకూలమైన స్థలాలలో చెట్లను నాటి పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరినారు. విద్యుత్ వాహన వినియోగం, సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ ఖ ర్చులు తగ్గడంతో పాటు ఆదాయ వనరుగా కూడా ఉపయోగించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఉపాధ్యక్షులు మౌళి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి మడూరి వేద ప్రకా ష్, సంయుక్త కార్యదర్శి సాగర్ల శ్రీనివాస్, కోశాధికారి అల్లే సంపత్, మార్కెట్ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి ఆర్ మల్లేశం, మార్కెట్ అధికారులు, రైతులు, కార్మికులు పాల్గొన్నారు.