15 May, 2026 | 2:52 AM

ప్రభుత్వ పాఠశాలల్లో 100% నమోదు లక్ష్యం

15-05-2026 01:19 AM

సత్తుపల్లి. మే 14. ( విజయ క్రాంతి ) : 2026-27 విద్యాసంవత్సరానికి గాను ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమాన్ని మే 14 నుండి జూన్ 19 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మూడో వార్డు అంబేద్కర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించినటువంటి బడి బాట కార్యక్రమాన్ని సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్  బొంతు సుమలత వేణు ప్రారంభించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు, ప్రతి చిన్నారికి విద్యాహక్కును కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని వారు పేర్కొన్నారు. బడి ఈడు పిల్లలందరినీ గుర్తించి, వారిని సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ముఖ్యంగా అంగన్వాడీ పిల్లలను ప్రాథమిక పాఠశాలల్లోకి, ప్రాథమిక పాఠశాల పూర్తి చేసిన వారిని ఉన్నత పాఠశాలల్లోకి చేర్చేలా ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు.. ఈ కార్యక్రమంలో 3 వ  వార్డు నాయకులు ,విద్యార్థులు ,తల్లిదండ్రులు పాల్గొన్నారు.