ప్రభుత్వ పాఠశాలల సమస్యలకు సత్వర పరిష్కారం
ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్, జూన్ 17 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపిస్తున్నామని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు.బుధవారం యూసుఫ్ గూడ చెక్ పోస్టులో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి ఆవరణలో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగిం చాలని అధికారులను ఆదేశించారు.
నిరుపయోగంగా మారిన టాయిలెట్లకు మరమ్మ తులు చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని సూచించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.ప్రతి పాఠశాలను ఆదర్శవంతమైన విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.యూసుఫ్ గూడ పాఠశాలలో గుర్తించి సమస్యలను నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు,సిబ్బంది,అధికారులు తదితరులు పాల్గొన్నారు.






