24 August, 2026 | 10:17 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

‘విద్యుత్ సమస్యను పరిష్కరించండి’

25-06-2025 01:38 AM

హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట వివేకా నంద నగర్ సర్వే నంబర్ 271, 270, 269 లో విద్యుత్ సమస్య గురించి, లో వోల్టేజ్ ప్లాట్‌లకు ఎల్టి సప్లై గురించి మంగళవారం వివేకానంద కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున చీఫ్ ఇంజనీర్ ఎల్ పాండ్యాను కలిసి విన్నవించారు. తమ కాలనీ పరిసర ప్రాంతాల్లో 6చోట్ల సింగిల్ ఫేస్ ట్రాన్స్‌ఫా ర్మర్లు ఉన్నాయని, దానివల్ల ఒక్కొక్క దాని మీద లోడు పడుతుందని చెప్పిరు.

లో వోల్టేజ్ సమస్య వస్తున్నందున పెద్ద ట్రాన్స్ ఫార్మర్ పెట్టాలని కోరారు. చీఫ్ ఇంజనీర్ ఈ సమస్యను డివిజనల్ ఇంజనీర్ టెక్నికల్ పవర్ కోటేశ్వరరావుకు చేరవేశారు. డీఈ టెక్నికల్  స్పందించి పెద్ద అంబర్పేట్ అసిస్టెం ట్ ఇంజనీర్‌కు ఫోన్ చేసి చర్యలు తీసుకో వాలని సూచనలు ఇచ్చారు. కాగా చీఫ్ ఇంజనీర్ ఎల్ పాండ్యాను కలిసిన వారిలో వివేకానంద కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బి శేఖర్, ఉపాధ్యక్షుడు బి.వి. సుధీర్ తదితరులు ఉన్నారు.