24 August, 2026 | 11:24 PM

Breaking News

27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •   సేవోత్తమ్ శిక్షణలో ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు   •  

జూలై 9 సమ్మెను జయప్రదం చేయాలి

25-06-2025 01:38 AM

శ్రీరాంపూర్ జీఎంకు వినతి పత్రం అందజేసిన సీఐటీయూ నాయకులు 

శ్రీరాంపూర్ (మంచిర్యాల), జూన్ 24 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను నిలుపుదల చేయాలని, సింగరేణి పరిరక్షణకు కొత్త గను లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) శ్రీరాంపూర్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీరాంపూర్ ఏరి యా జనరల్ మేనేజర్ శ్రీనివాస్‌కి సమ్మె నోటీసు అందజేశారు.

అనంతరం ఎస్‌సిఈ యు బ్రాంచ్ అధ్యక్షుడు గుల్ల బాలాజీ మాట్లాడుతూ సింగరేణిలో జూలై 9న జరుపతలపెట్టిన సమ్మెను సంపూర్ణంగా జయ ప్రదం చేయాలని కార్మికులకు  పిలుపునిచ్చా రు. కేంద్ర ప్రభుత్వ చర్యలు సింగరేణికి శాపంగా మారాయని, సింగరేణిని కాపాడుకోవడానికి సమ్మె ఒక్కటే మార్గమని, ప్రభు త్వరంగ సంస్థలను కాపాడుకోవాలని, కార్మికులను కట్టు బానిసలుగా మార్చనున్న ఈ లేబర్ కోర్డులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ వైస్ ప్రెసిడెంట్ కస్తూరి చంద్రశేఖర్, చీఫ్ ఆర్గనైజర్ వెంగళ శ్రీనివాస్, బ్రాంచ్ నాయకులు పెరుక సదానందం, తోడే సుధాకర్, సిరికొండ శ్రీనివాస్, బోడకుంట శంకర్, బొజ్జ నవీన్, గుపెళ్లి కృష్ణ, వెంకట్ రెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.