calender_icon.png 25 June, 2025 | 5:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలర్ కోటెడ్ షీట్ల సామర్థ్యం పెంపు

25-06-2025 01:37:14 AM

25శాతం పెంచనున్న కామధేను లిమిటెడ్

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 24 (విజయక్రాంతి): కామధేను లిమిటెడ్ తెలంగా ణలో తన బ్రాండెడ్ కలర్ కోటెడ్ షీట్ల తయారీ సామర్థ్యాన్ని 25 శాతం పెంచనుందని ఒక ప్రకటనలో తెలిపారు. తన బ్రాండ్ మార్కెట్ వాటా, ఉనికిని తిరిగి బలోపేతం చేసుకునేందుకు వ్యూహాత్మక చర్యలో భాగం గా తెలంగాణలో కామధేను కలర్ మాక్స్ షీట్ అడుగులు వేస్తోంది.

భారతదేశంలో అతిపెద్ద బ్రాండెడ్ టిఎంటి బార్ల తయారీదారు, విక్రయదారు అయిన కామధేను లిమిటెడ్ సంవత్సరం లోపు దాని తయారీ సామర్థ్యాన్ని 25 శాతం పెంచే ప్రణాళికలను ప్రకటించింది. కామధేను లిమిటెడ్ వచ్చే ఏడాదిలో తయారీ సామర్థ్యాన్ని 2400 ఏంటి నుంచి 3000 ఏంటికు పెంచడం ద్వారా ఈ డిమాండ్‌ను  తీర్చాలని భావిస్తోంది. కామధేను లిమిటెడ్ డైరెక్టర్ సునీల్ అగర్వాల్ మాట్లాడుతూ.. “నేడు, కామధేను కలర్ కోటెడ్ను అనేక ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర ప్రాజెక్టులలో ఉపయోగిస్తున్నారు.

రాష్ట్రంలో నిరంతరం పెరుగుతున్న గృహ మరియు మౌలిక సదుపాయాల రంగం ద్వారా మా ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను చూసి, మా అధిక నాణ్యత గల కలర్ కోటెడ్ షీట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి మేము కట్టుబడి ఉన్నాము” అని తెలిపారు.