23-04-2025 09:06:48 AM
స్టేడియంలో మీటింగ్లకు వ్యాపార అవసరాలకు ఇవ్వవద్దు
తాగుబోతులకు అడ్డాగా మారకుండా చూడాలి
క్రీడాకారుల కోసం స్టేడియంలో సౌకర్యాలు కల్పించాలి
జలాల్ సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): కొత్తగూడెం పట్టణంలో ఉన్న 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన ప్రకాశం స్టేడియం(Prakasam Stadium) సమస్యల లోగిళ్లలో కొట్టుమిట్టాడుతుందని సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్ ఆవేదన వ్యక్తం చేశారు. స్టేడియంలో క్రీడాకారులు ఈవెంట్స్ చేసుకునేందుకు ఉదయం వాకింగ్ రన్నింగ్ చేసుకునేందుకు అనువుగా లేకుండా ఉంటుందని మందుబాబులకు అడ్డాగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం స్టేడియం ను రాజకీయ సభలకు వ్యాపార సమావేశాలు కార్యక్రమాల కోసం ఇవ్వవద్దని ఆయన డిమాండ్ చేశారు. ఉదయం పూట వాకింగ్ రన్నింగ్ కి ఇతర ప్రాక్టీసు చేసుకునేందుకు వస్తున్న క్రీడాకారులకు తీవ్ర అసౌకర్యంగా ఉందన్నారు.
స్టేడియంలో క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, మందుబాబులు స్టేడియం ను ఉపయోగించుకోకుండా చూడాలని సింగరేణి ఈవెంట్స్ కాకుండా ,స్థానిక క్రీడాకారులు చేసుకునే అన్ని రకాల ఈవెంట్స్ కు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా ఉపయోగించుకునేలా చూడాలని, క్రీడాకారులను సింగరేణి ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. కార్మికుల శ్రమతో సింగరేణి నిలబడి ఉందని ఆ కార్మికుల పిల్లలు క్రీడాకారులుగా ఈ వందేళ్ళ స్టేడియం చరిత్రలో ఎంతోమంది ఈ ప్రాంతం నుంచి క్రీడాకారులుగా నిలదొక్కుకున్నారని అందులో సింగరేణి పాత్ర కూడా ఉందని ఆయన తెలిపారు. క్రీడాకారులను మరింత ప్రోత్సహించేందుకు సింగరేణి యాజమాన్యం స్టేడియంలో సౌకర్యాలు కల్పిస్తూ అన్ని విధాలుగా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.