24 August, 2026 | 9:48 AM

CPM రాష్ట్ర సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

24-08-2026 08:45 AM

మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రముఖ రైతు నేత, సిపిఎం సినియర్ నేత, అఖిల భారత కిసాన్ సభ మాజీ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి(Sarampalli Malla Reddy passes away) (88) సోమవారం తెల్లవారు జామున హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆయన దశాబ్దాలుగా రైతుల సమస్యలపై నిరంతరం పోరాడారు. రైతుల హక్కులు, వ్యవసాయ రంగ సమస్యలపై తన గళాన్ని బలంగా వినిపించిన మల్లారెడ్డి.. రైతు ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన మృతితో రైతాంగం పక్షాన నిలబడి ప్రభుత్వాలను ప్రశ్నించే గొంతు మూగబోయింది.