24 August, 2026 | 10:24 AM

కోడి పుంజులాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

24-08-2026 09:21 AM

బెజ్జూర్ ఆగస్టు 24 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండలంలోని మొగవెల్లి  గ్రామ శివారులో కొంతమంది వ్యక్తులు కోడి పుంజులాట  ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు కోడిపుంజుల స్థావరాలపై ఎస్సై సర్తాజ్ పాషా, సిబ్బందితో కలిసి మెరుపు దాడి నిర్వహించినట్లు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీ చేయగా,  కోడి పుంజులాట ఆడుతున్న ఎనిమీది  వ్యక్తులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పోలీసులను గమనించిన మరికొంత మంది వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ కేసు నమోదు చేసి, పరారైన వ్యక్తుల ఆచూకీ కోసం దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు. పట్టుబడిన వారినుండి  3000 రూపాయల నగదును , రెండు కోడి పుంజులను , రెండు కత్తులను, నాలుగు  మొబైలు ఫోన్ లను  6 బైక్ లను  స్వాదిన పర్చుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ వారు తెలిపినారు.  కోడి పందెలాట  ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని బెజ్జూర్ పోలీసులు తెలిపారు.