24 August, 2026 | 3:17 AM

పాలనలో ప్రక్షాళన!

24-08-2026 02:40 AM

గాడిలో పెట్టేందుకు భారీ మార్పులకు ప్రభుత్వం కసరత్తు

  1. పూర్తికావస్తున్న మూడేళ్ల పాలన
  2. లోపాలను గుర్తించి సరిదిద్దడంపై దృష్టి అధికారుల పనితీరుపైనా సమీక్ష
  3. ఉన్నతాధికారుల బదిలీలకు రంగం సిద్ధం?
  4. వచ్చేనెల తొలివారంలో భారీగా ఐఏఎస్‌ల మార్పులు ఉంటాయన్న చర్చ
  5.  22 ఏ వ్యవహారంలో బాధ్యులైన అధికారులపైనా చర్యలకు అవకాశం

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థను మరోసారి గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్ల పాలన పూర్తి చేసుకునే దశకు చేరుకోవడం తో ఇక మిగిలిన రెండేళ్ల కాలాన్ని అత్యంత కీలకంగా భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకు పాలనలో ఎదురైన ఇబ్బందులు, వివిధ శాఖల్లో చోటుచేసుకున్న లోపాలు, ప్రభుత్వ నిర్ణయాల అమలులో కనిపించిన జాప్యం,

కొన్ని సందర్భాల్లో అధికారుల నిర్ణయాలతో ప్రభుత్వం ఇరుకున పడిన పరిస్థితులను సమీక్షించి.. అవసరమైన చోట సమూల మార్పులు చేయాలని సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. రాబో యే రెండేళ్లలో ప్రభుత్వ పనితీరు ప్రజల మధ్య నేరుగా కనిపించాల్సి ఉండటంతో పరిపాలనా యంత్రాంగాన్ని మరింత బాధ్యతాయుతంగా, వేగంగా పనిచేసేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉన్నతస్థాయిలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం.

ఇందు లో భాగంగా శాఖలవారీగా అధికారుల పనితీరు, నిర్ణయాలు తీసుకునే విధానం, ప్రభుత్వ ప్రాధాన్యాలను అమలుచేస్తున్న తీరు, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ వంటి అంశాలను పరిశీలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పాలనలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నది. అయితే కొన్ని నిర్ణయాలు అమలు దశలో వివాదాలకు దారితీయడం, కొన్ని అంశాల్లో న్యాయపరమైన చిక్కులు ఎదురవడం,

మరికొన్ని వ్యవహారాల్లో అధికారుల నిర్ణయాలపై ప్రభుత్వానికి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితులు రావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి అంశాలను ప్రభు త్వం ఇప్పుడు వెనక్కి తిరిగి సమీక్షిస్తున్నట్టు తెలుస్తున్నది. పాలనలో ఎక్కడ తప్పిదాలు జరిగాయి? ఎక్కడ నిర్ణయాల అమలు నెమ్మదించింది? ఏ శాఖలో అధికారుల మధ్య సమన్వయం కొరవడింది? ప్రభుత్వ నిర్ణయాలు క్షేత్రస్థాయికి ఎందుకు చేరడంలేదు?

అధికారుల స్థాయిలో తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వం ఎందుకు వివరణ ఇవ్వాల్సి వస్తున్నది? వంటి ప్రశ్నలపై దృష్టి పెట్టినట్టు సమాచారం. ప్రభుత్వానికి మిగిలిన రెండేళ్ల కాలంలో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్న ఆలోచన ఉన్నట్టు తెలుస్తున్నది.

సెప్టెంబర్ తొలి వారంపైనే దృష్టి..

ఇప్పటివరకు సాధారణ బదిలీల తరహాలో కాకుండా అధికారుల పనితీరును కూడా ప్రాతిపదికగా తీసుకుని మార్పులు చేయాలన్న ఆలోచన ఉన్నట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కీలక శాఖ ల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారుల్లో ఎవరు ప్రభుత్వ ప్రాధాన్యాలను వేగంగా అమలు చేస్తున్నారు? ఎవరి పనితీరు ఆశించిన స్థాయిలో లేదు? ఎవరికి ఏ శాఖపై అనుభవం ఉన్నది? ఎక్కడ మరింత సమర్థవంతమైన అధికారిని నియమించాల్సిన అవసరం ఉన్నది? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నది. 

దీంతో రాబోయే బదిలీలు కేవలం సాధారణ పరిపాలనా ప్రక్రియగా కాకుండా.. ప్రభుత్వానికి అవసరమైన విధంగా అధికార యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించే చర్యగా ఉండొచ్చన్న చర్చ సాగుతున్నది. భారీస్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలు ఉం టాయన్న ప్రచారం ప్రస్తుతం అధికార వర్గా ల్లో ఆసక్తి రేపుతున్నది. సెప్టెంబర్ మొదటి వారంలో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందన్న చర్చ జరుగుతున్నది.

అయితే తుది నిర్ణయం సీఎం స్థాయిలో జరిగే సమీక్షలు, పరిపాలనా అవసరాలు, ఆయా శాఖల పనితీరు ఆధారంగా మారే అవకాశం ఉన్నది. కొన్ని కీలక శాఖల్లోని అధికారులను కొనసాగిస్తూ.. మరికొన్ని శాఖల్లో కొత్తవారికి బాధ్య తలు అప్పగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే దీర్ఘకాలంగా ఒకేచోట పని చేస్తున్న అధికారులు, కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు, పనితీరుపై అసం తృప్తిగా ఉన్న అధికారుల విషయంలో ప్రత్యేకంగా సమీక్ష జరిగే అవకాశం ఉందని తెలు స్తున్నది.

సీఎంవో, సచివాలయంలోని ఉన్నతాధికారులు, శాఖాధిపతులు, జిల్లాస్థాయి యంత్రాంగం మధ్య సమన్వయం పరిపాలనలో ఎంతో కీలకం. ప్రభుత్వ నిర్ణయం తీసు కున్న తర్వాత అది వేగంగా క్షేత్రస్థాయికి చేరాలంటే ఈ వ్యవస్థలన్నీ సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది.

అయితే కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటి అమలులో జాప్యం చోటుచేసుకోవ డం, ఒక శాఖ తీసుకున్న నిర్ణయానికి మరో శాఖ నుంచి అవసరమైన సహకారం అందకపోవడం, కీలక అంశాలపై ముందస్తు న్యా యపరమైన పరిశీలన లేకపోవడం వంటి సమస్యలు ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేశాయన్న అభిప్రాయం ఉన్నట్టు సమా చారం. దీంతో ఇకపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. అధికార యంత్రాంగం దాన్ని నిర్దిష్ట సమయంలో అమలుచేయాలి అనే లా బాధ్యతలను స్పష్టంగా నిర్దేశించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది.

అధికారుల తప్పిదాలతో ప్రభుత్వానికి నష్టం..

పాలనలో రాజకీయ నిర్ణయాలు తీసుకునేది ప్రభుత్వం అయినప్పటికీ వాటిని అమ లుచేసేది అధికార యంత్రాంగమే. ఈ నేపథ్యంలో కొన్ని నిర్ణయాల అమలులో అధికా రులస్థాయిలో జరిగిన పొరపాట్లు చివరకు రాజకీయంగా ప్రభుత్వానికే నష్టం కలిగిస్తున్నాయన్న భావన ఉన్నట్టు తెలుస్తున్నది. ఒక నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత శా ఖల నుంచి పూర్తి సమాచారం తీసుకోకపోవడం, న్యాయపరమైన అంశాలను పూర్తిగా పరిశీలించకపోవడం, క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేయకపోవడం, ప్రభుత్వా నికి పూర్తి సమాచారం అందించడంలో జా ప్యంచేయడం వంటి అంశాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.

ఇటీవల వివాదాస్పదమైన 22 ఏ జాబితా వ్యవహారం కూడా పరిపాలనా ప్రక్షాళనలో కీలక అంశంగా మారే అవకాశం ఉన్నట్టు తె లుస్తున్నది. భూముల రికార్డులు, నిషేధిత జాబితా, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ వ్యవహారాల కు సంబంధించిన అంశాల్లో అధికారుల నిర్ణయాలు అత్యంత సున్నితమైనవి కావడం తో.. ఇందులో ఎక్కడ తప్పిదం జరిగింది? ఎవరిస్థాయిలో నిర్ణయం తీసుకున్నారు? సరైన పర్యవేక్షణ ఎందుకు జరగలేదు? అన్న అంశాలను పరిశీలించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఈ వ్యవహారంలో బాధ్యత ని ర్ధారణ అయితే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న చర్చ జరుగుతున్నది. అయితే ఎవరిపై చర్యలు తీసుకోవాలన్నది పూర్తిస్థాయి పరిశీలన, ఆధారాలు, బాధ్యత నిర్ధారణ త ర్వాతే తేలే అవకాశం ఉన్నది. 22 ఏ వ్యవహారంతోపాటు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపైనా ప్రభుత్వం దృష్టి సారించనున్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వ ఆదేశాలను అమలుచేయడంలో నిర్లక్ష్యం, ఫైళ్లను పెండింగ్‌లో ఉంచడం, ప్రజా సమస్యల పరిష్కారం లో జాప్యం,

ఉన్నతాధికారుల ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయకపోవడం వం టి అంశాలను ఇకపై సీరియస్‌గా తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటివ రకు పరిపాలనా పరమైన లోపాలపై వివరణలు తీసుకోవడం, హెచ్చరికలు ఇవ్వడం వంటి చర్యలకు పరిమితమైన ప్రభుత్వం.. ఇకపై బదిలీ, పోస్టింగ్ మార్పు లేదా శాఖాపరమైన చర్యల దిశగా వెళ్లే అవకాశం ఉందన్న చర్చ జరుగుతున్నది.

పునర్వ్యవస్థీకరణ అవసరం..

ప్రస్తుతం అత్యవసర విధుల్లో ఉన్న, కీలక ప్రాజెక్టులు లేదా ప్రత్యేక బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులను బదిలీల నుంచి మిన హాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. కొన్ని శాఖల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ప నులు, కీలక ప్రాజెక్టుల పురోగతి దృష్ట్యా ఒక్కసారిగా అధికారులను మార్చడం వల్ల అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకో వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. అంటే బదిలీలన్నీ ఒకేలా కాకుండా..

పనితీరు, బాధ్యత, ప్రస్తుత పోస్టు అవసరం, అనుభవం, కొనసాగుతున్న ప్రాజెక్టులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. మిగిలిన రెండేళ్లు ప్రభుత్వానికి రాజకీయంగా కూడా అత్యంత కీలకం. చివరి ఏడాది ఎన్నికల వాతావరణం మొదలైతే.. కొత్త పరిపాలనా మార్పులు, విధానాల అ మలు, అధికారుల పునర్వ్యవస్థీకరణకు సమ యం తక్కువగా ఉంటుంది. అందుకే ఇప్పు డే లోపాలను గుర్తించి అధికార యంత్రాంగాన్ని సరిచేసుకోవాలని ప్రభుత్వం భావిస్తు న్నట్టు తెలుస్తున్నది.

ఈ నేపథ్యంలో రాబో యే బదిలీలు కేవలం అధికారుల పోస్టింగ్‌ల మార్పుగా కాకుండా వచ్చే రెండేళ్ల పాలనకు అవసరమైన టీంను ఏర్పాటు చేసే ప్రయత్నంగా భావించవచ్చన్న అభిప్రాయం వ్యక్త మవుతున్నది. కీలక శాఖల్లో ఎవరు కొనసాగుతారు? ఎవరికి కొత్త బాధ్యతలు వస్తా యి? దీర్ఘకాలంగా ఒకేస్థానంలో ఉన్నవారిలో ఎంతమందికి స్థానచలనం ఉంటుం ది? పనితీరుపై అసంతృప్తి ఉన్న అధికారుల పరిస్థితి ఏమిటి? 22 ఏ వంటి వివాదాస్పద అంశాల్లో బాధ్యత వహించిన అధికారులపై ఎలాంటి చర్యలు ఉంటాయి?

అన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చే నెల భారీస్థాయిలో ఐఏఎస్ బదిలీలు జరిగితే.. అవి సాధారణ బదిలీలుగా కాకుండా కీలక మార్పులకు సంకేతంగా మారే అవకాశం ఉన్నది. రాబోయే రెండేళ్లలో ప్రభుత్వం ఎదుర్కోబో యే రాజకీయ, పరిపాలనా సవాళ్లను దృష్టి లో పెట్టుకుంటే.. సమయం తక్కువ.. పని ఎ క్కువ అన్న విధంగా అధికార యంత్రాంగాన్ని ఇప్పుడే పునర్వ్యవస్థీకరించుకోవాల్సిన అవసరం ఉన్నదన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.