24 August, 2026 | 2:58 AM

బకాయిలేవీ?

24-08-2026 02:26 AM
  1. ఆరోగ్యశ్రీ నిధులు రూ.1,400 కోట్లు పెండింగ్  
  2. సిబ్బందికి 18 నెలలుగా వేతనాల్లేవు
  3. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పథకం నిర్వీర్యం
  4. మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం 
  5. నాసిరకం యూనిఫాంపై విచారణ జరపాలని డిమాండ్

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి) : ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకుండా, సిబ్బందికి 18 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ, ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభు త్వం నిర్వీర్యం చేస్తున్నదని ధ్వజమెత్తా రు. ఆరోగ్యశ్రీ సేవలందించిన ఆస్పత్రులకు పెండింగ్‌లో ఉన్న రూ. 1,400 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఆరోగ్యశ్రీ పథకం సిబ్బం ది హరీశ్‌రావును ఆయన నివాసంలో ఆదివారం కలిసి తమ సమస్యలపై విన్నవించారు. 18 నెలలుగా వేతనాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భం గా హరీశ్‌రావు మాట్లాడుతూ.. నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోతే సిబ్బంది ఎలాబతకాలని, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు, కుటుంబ ఖర్చులు ఎవరు భరించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు చెల్లిస్తామని హా మీ ఇచ్చిన ప్రభుత్వం.. మాట నిలుపుకోవడంలో విఫలమైందని విమర్శించారు.

సిద్ది పేట ప్రభుత్వ ఆసుపత్రులకు 2023 నవంబర్ నుంచి ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ నిధులు ఒక రూపాయి విడుదల కాలేదని, దాదాపు రూ.24 కోట్లు పెండింగ్ ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని  ఆస్పత్రిలో నూ ఇదే పరిస్థితి ఉందన్నారు. నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఆసుపత్రుల నిర్వ హణ, రోగుల సంరక్షణ, మందులు, వైద్య పరికరాలపై ప్రభావం పడుతుందని, తద్వా రా రోగులకు సేవలు అందడంలేదని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రైవే ట్ ఆసుపత్రులకు కూడా నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో పెట్టారని, దీంతో వైద్యసిబ్బంది వేతనాలు, మందులు, పరికరాల కొనుగోలు, ఆసుపత్రుల నిర్వహణపై ఆర్థిక భారం పడుతుందన్నారు.

ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని గొప్పగా ప్రకటించిన ప్రభు త్వం.. ఆచరణలో పెట్టకుండా ఆరోగ్య శ్రీ వ్య వస్థను నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు.  ఆరోగ్యశ్రీ సేవలుకొనసాగించడం ఆసుపత్రులకు భారంగా మారితే నష్టపోయేది పేద రోగులేనన్నారు.  ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులనే తేడా చూపకుండా, సీనియారిటీ, ఫస్ట్ కమ్‌ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన  నిధులు విడుదల చేయాలని, బకాయిలను విడుదల చేయాలని, సిబ్బంది వేతనాలు తక్షణమే చెల్లించాలని కోరారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ని ర్వీర్యం చేసే కుట్రలకు స్వస్తిపలికి, పేదల ప్రా ణాధారమైన ఈ పథకాన్ని పకడ్బందీగా కొ నసాగించాలని ప్రభుత్వానికి సూచించారు. 

రేవంత్.. ఇవేనా అంతర్జాతీయ ప్రమాణాలు?

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాసిరకం యూనిఫారాలు అందజేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. మాట్లాడితే ప్ర పంచ స్థాయి విద్యా వ్యవస్థ అనే మీరు..  వి ద్యార్థులకు కనీసం నాణ్యమైన యూనిఫారాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారా? మీరు చెప్పే అంతర్జాతీయ ప్రమాణాలు ఇవేనా? అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. నాసిరకం యూనిఫారాలపై ఆదివారం ట్విట్టర్ వేదికగా హరీశ్‌రావు స్పందించారు. ఒకచోట యూనిఫారాలు అందలేదు.. అందిన చోట కొలతలు సరిగ్గా లేవు.. కుట్లు ఊడిపోతున్నాయి..

ఉతికితే రంగులు వెలిసిపోతు న్నాయని తెలిపారు. రెండు జతలు ఇవ్వాల్సి ఉండగా, చాలా చోట్ల ఒక్క జత కూడా అం దలేదని వెల్లడించారు. రేవంత్‌రెడ్డికి గుజరాత్ దళారులపై ఉన్న ప్రేమ తెలంగాణ చేనే త కార్మికులపై లేదని విమర్శించారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేలా స్థానికంగా యూనిఫారాల తయారీకి ప్రాధాన్యత ఇవ్వాల్సింది పోయి కమీషన్ల కోసం బడా కార్పొరే ట్ల నుంచి నాసిరకం యూనిఫారాలు తెప్పిం చి విద్యార్థులకు, చేనేత కార్మికులకు అన్యా యం చేశారని మండిపడ్డారు. ‘మఫత్‌లాల్ ముద్దు.. చేనేత వద్దు’అన్నదే ప్రభుత్వ వైఖరిగా మారిందా? అని నిలదీశారు. నాసిరకం యూనిఫామ్‌లపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.