calender_icon.png 20 February, 2026 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెక్రటేరియట్ ముట్టడి విజయవంతం చేయాలి

20-02-2026 04:15:54 PM

 జేఏసీ  చైర్మన్ టీఎస్ సింగ్

హుజురాబాద్,(విజయక్రాంతి): ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న తలపెట్టిన సెక్రెటరీయట్ ముట్టడి విజయవంతం చేయాలని జేఏసీ చైర్మన్ టిఎస్ సింగ్ కార్మికులను కోరారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని బస్సు డిపో ఆవరణలో కార్మికులతో కలిసి శుక్రవారం ధర్నాపోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.

 2021 వ సంవత్సరం పే స్కేల్ ను 30% అమలుపరచాలన్నారు. మహాలక్ష్మి పథకం కింద కార్మికులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని, ఆర్టీసీలో యూనియన్లను పునరుద్దించాలని, మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న  సమస్యలను ప్రభుత్వంవెంటనే పరిష్కరించాలని, రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాధుల కిషోర్, అంబాల రాజు, పి రాంబాబు, అశోక్,కే వెంకన్న, వి తిరుపతి,వీరయ్య, కమలాకర్, శ్రీనివాస్, వేల్పుల ప్రభాకర్, యాదగిరి తో పాటు తదితరులు పాల్గొన్నారు.