20-02-2026 04:19:32 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మాసానిపల్లి గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను, అంగన్వాడి కేంద్రం, ప్రాథమిక పాఠశాల శుక్రవారం ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనుల్లో నాణ్యత లోపం లేకుండా పనులు చేపట్టాలని మేస్త్రీలకు సూచించారు. నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు నిరుపేదల సంక్షేమం వారి అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటుందని తెలిపారు. పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు మంచి పౌష్టిక ఆహారాన్ని అందించాలని, విద్యార్థుల పట్ల శ్రద్ధగా వహించి మంచి విద్యను బోధించాలన్నారు. అలాగే ఆత్మకూరు గ్రామంలో నర్సరీని, పల్లె ప్రకృతి వనం, కంపోస్ట్ షెడ్ వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్ త్వరలో ఉన్న మొక్కలకు నీళ్లు పట్టారు.
నర్సరీలో అన్ని రకాల మొక్కలను పెట్టాలని వాటి సంరక్షణ సక్రమంగా నిర్వహించాలని గ్రామాలకు ఇచ్చిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలను పెంచాలన్నారు. నర్సరీలు ఉన్న ప్రతి మొక్క బ్రతకాలని, ఉదయం సాయంత్రం వేళలో తప్పకుండా నీటిని దించాలన్నారు. ఎందుకంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున మొక్కలు చనిపోయే ఆస్కారం ఉందని మొక్కలపై శ్రద్ధ బాగా పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మాసంపల్లి గ్రామ సర్పంచ్ పెద్దపట్లోళ్ల సునంద కిషన్ రెడ్డి, కార్యదర్శిలు సుభాష్ రెడ్డి, సావిత్రి, ఫీల్డ్ అసిస్టెంట్ సాయిలు తదితరులు ఉన్నారు.