11 August, 2026 | 1:47 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

ఈసీఐఎల్‌లో దారుణం.. తండ్రిని చంపిన కుమారుడు

22-02-2025 03:46 PM

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి(Medchal-Malkajgiri) జిల్లా ఈసీఐఎల్(ECIL)లో దారుణం చోటుచేసుకుంది. కుమారుడి చేతిలో తండ్రి హత్యకు గురయ్యాడు. ఈసీఐఎల్ బస్టాప్ లో కుమారుడు తండ్రిపై కత్తితో దాడి చేశాడు. ఐసీఐఎల్ కూడలిలో నడిరోడ్డుపై తండ్రి మొగిలి(45)ని కుమారుడు 10-15 సార్లు కత్తితో పొడిచాడు. బాధితుడు మొగిలిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆస్తి తగాదాలతోనే తండ్రిపై కొడుకు దాడి చేసినట్లు సమాచారం. నిందితుడు సాయి(25)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.