ఒంగోలు దారుణ ఘటన: బతికుండగానే తల్లికి నిప్పు పెట్టిన కుమారుడు!
14-04-2026 11:36 AM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(Andhra Pradesh State) ఒంగోలు గద్దలగుంటలో దారుణం చోటుచేసుకుంది. ఓ దరిద్రుడు నవమాసాలు మోసి పెంచిన కన్నతల్లినే కర్కశంగా కడతేర్చాడు. తల్లి బతికి ఉండగానే నిప్పు పెట్టాడు. మంగళవారం తెల్లవారుజామున తల్లి నిద్ర పోతుండగా నిందితుడు కిషోర్ ఇంటికి నిప్పుపెట్టాడు.
తల్లి వెంకటరమణమ్మ మంటల్లో చిక్కిపోయి మాంసపు ముద్దలా మారింది. చుట్టుపక్కలవారు నిలదీయటంతో కిషోర్ అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్నఅగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.




