27 August, 2026 | 8:22 AM

ప్రైవేట్ పాఠశాలలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి

25-06-2026 01:40 AM

ప్రైవేట్ పాఠశాలల దోపిడీ అరికట్టేది ఎవరు..?

ముఖ్యాంశాలు:

తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్.

  • విద్య హక్కు చట్టం ప్రకారం 25% ఉచిత విద్య అమలులో లోపాలపై విమర్శలు.
  • వ్యాన్ ఫీజులు, యూనిఫాం, ఇతర ఛార్జీలు అధికంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు.
  • ప్లేగ్రౌండ్లు, క్రీడా సదుపాయాలు లేని పాఠశాలలపై చర్యలు కోరిన సంఘాలు.
  • తమిళనాడు తరహాలో ఫీజు నియంత్రణ విధానం తీసుకురావాలని విజ్ఞప్తి.

భీమదేవరపల్లి, జూన్ 24 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలో విద్య హక్కు చట్టం ప్రైవేటు విద్యాసంస్థల్లో నిరుపేదలకు  25% ఉచిత విద్యను అందించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ ఎద్దేవా చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ నియంత్రణ చట్టాన్ని అమలు చెయ్యాలని ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు విపరీతంగా విచ్చలవిడిగా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంలపై ప్రభుత్వ నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం మా విజయక్రాంతి న్యూస్‌ హోమ్‌పేజ్‌ను సందర్శించండి.

"ప్రతి ఏడాది పెరుగుతున్న స్కూల్ ఫీజులు.. సామాన్యులపై భారం.. తెలంగాణలో ఫీజు నియంత్రణ చట్టం ఎప్పుడు అమలవుతుంది?"

అదేవిధంగా వ్యాన్ ఫీజులు పెంచుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు కొన్ని పాఠశాలలకు పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా విద్యను వ్యాపారం చేస్తూ పాఠశాలలకు తగినంత ప్లే గ్రౌండ్ లేక పిల్లలకు వ్యాయామం క్రీడలు నేర్పించడంలో పాఠశాల యజమాన్యం మక్కువ చూపడం లేదు అని అన్నారు, అదేవిధంగా ప్రవేట్ పాఠశాల  యొక్క లక్ష్యం 10/10 స్టేట్ ర్యాంక్, జిల్లా ర్యాంకులకు పోటీపడే విధంగా పిల్లలను విపరీతంగా మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తూ బట్టి పట్టించే విధంగా విద్యా వ్యవస్థ యజమాన్యాలు నడుపుతున్నారు పిల్లలలకు అర్థమయ్యే రీతిలో సులభంగా చెప్పి అవగాహన కల్పించే విధంగా ఉండాలని కోరారు పిల్ అధికారులు ,ప్రజాప్రతినిధులు వాటిపైన శ్రద్ధ పెట్టకపోవడం వలననే వారి యొక్క ఫీజులు పెంచుకోవడం జరుగుతుంది.

ప్రైవేట్ పాఠశాలల య కన చేయడం సామాన్య ప్రజల రక్తం తాగుతున్నారు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 13 000 పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేసే ఫీజులను నియంత్రించడానికి చర్యలు చేపట్టి ప్రభుత్వం అమలు చేసిన ఫీజుల ప్రకారమే అక్కడి పాఠశాలలు నడుస్తున్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం .ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి టి. వై . బహుజన్,రాష్ట్ర కార్యదర్శి కండె సుధాకర్ ,వేముల జగదీష్, గంగారపు రవి ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

"స్కూల్ ఫీజుల భారం భరించలేక తల్లిదండ్రుల ఆవేదన.. తెలంగాణలో ఫీజు నియంత్రణ చట్టం అమలవుతుందా?"

ప్రశ్న: తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల ఫీజు నియంత్రణ చట్టం ఎందుకు అవసరం?

సమాధానం: ప్రైవేట్ పాఠశాలలు ప్రతి ఏడాది ఫీజులు, వ్యాన్ ఛార్జీలు పెంచుతూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెంచుతున్నాయి. విద్య హక్కు చట్టంలోని 25 శాతం ఉచిత విద్య అమలులో లోపాలు ఉండటంతో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది.

విద్యా రంగంలో తాజా పరిణామాలు, విద్యార్థులు-తల్లిదండ్రులకు ఉపయోగపడే వార్తల కోసం మా విద్యా వార్తలు విభాగాన్ని సందర్శించండి.

FAQ's

1. తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల ఫీజు నియంత్రణ చట్టం ఉందా?

ప్రస్తుతం ప్రత్యేక ఫీజు నియంత్రణ చట్టం అమలుపై డిమాండ్లు కొనసాగుతున్నాయి.

2. విద్య హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో ఎంత శాతం ఉచిత విద్య ఇవ్వాలి?

నిరుపేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలి.

3. తల్లిదండ్రులు అధిక ఫీజులపై ఎక్కడ ఫిర్యాదు చేయవచ్చు?

జిల్లా విద్యాధికారి (DEO) లేదా విద్యాశాఖ అధికారులను సంప్రదించవచ్చు.

4. ప్రైవేట్ పాఠశాలలు వ్యాన్ ఫీజులను స్వేచ్ఛగా పెంచవచ్చా?

రవాణా, విద్యాశాఖ నిబంధనలకు లోబడి మాత్రమే ఫీజులు నిర్ణయించాలి.

5. తమిళనాడు ఫీజు నియంత్రణ విధానం ఏమిటి?

ప్రభుత్వం నిర్దేశించిన పరిమితుల మేరకే ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు వసూలు చేయాల్సి ఉంటుంది.

Related Articles:

ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల దందాపై వస్తున్న ఆరోపణల గురించి తెలుసుకోవాలంటే "పుస్తకాల వెనుక ప్రైవేట్ స్కూళ్ల సిండికేట్..?" కథనాన్ని చదవండి.

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై మరింత సమాచారం కోసం "ప్రైవేట్ స్కూల్ నుంచి సర్కార్ బడికి సర్పంచ్ కూతురు" ప్రత్యేక కథనాన్ని వీక్షించండి.