24 July, 2026 | 3:54 PM

మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసుకోండి

24-07-2026 03:23 PM

బోథ్: ప్రభుత్వ మంజూరు చేసిన మొదటి విడత ఇందిరమ్మ ఇండను సకాలంలో పూర్తి చేసుకోవాలని సోనాల ఎంపీడీవో రత్నాకర్ రావు కోరారు శుక్రవారం మండలంలోని ఘనపూర్, టివి టి. గ్రామాలలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడుతూ... మొదటి విడత మంజూరి అయిన ఇండ్లను సకాలంలో పూర్తి చేసుకుంటే రెండవ విడత మంజూరు అవుతాయన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని లబ్ధిదారులు సాధ్యమైనంత త్వరగా ఇండ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు.