24 July, 2026 | 3:58 PM

మంథనిలో కేటీఆర్ జన్మదిన వేడుకలు

24-07-2026 03:25 PM

మంథని,(విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను మంథని పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంథని అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాన్ని చేపట్టారు.