02-12-2025 02:09:55 AM
దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యుఫోరియా’. ఈ సినిమాను గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్, నాజర్ తదితరులు ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు.
డిసెంబర్ 25న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. 2026, ఫిబ్రవరి 6న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా వెల్లడిస్తూ, టీజర్‌ను రిలీజ్ చేశారు. నేటి యూత్ డ్రగ్స్ మహమ్మారి వల్ల ఎలా పెడదారులు పడుతుందనే విషయాన్ని చూపిస్తూనే తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉండాలనే విషయాన్ని భూమిక పాత్రతో పరిచయం చేశారు. కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ కే పోతన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.