calender_icon.png 4 December, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు పాటలతో మానసిక ఉల్లాసం

04-12-2025 01:28:12 AM

తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ సుధాకర్ గౌడ్

కామారెడ్డి, డిసెంబర్ 3 (విజయక్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో  ప్రవాస భారతీయుల చెస్ నెట్వర్క్ అసోసియేషన్ వ్యవస్థాపకులు సుధీర్ కోదేటి, చెస్ క్లబ్ చైర్మన్  సంజయ్ గజాల సహకారంతో  బుధవారం  తెలంగాణ విశ్వవిద్యాల యం సౌత్ క్యాంపస్ లో  చెస్ క్లబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా 10 చెస్ బోర్డులను, చెస్ ఆడేందుకు  కరదీపికలను  అందించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  చెస్ నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ మెంబర్  కిరణ్ కుమార్ రెడ్డి హాజరై ఆయన మాట్లాడుతూ చెస్ అనేది భారతీయులు ప్రపంచానికి అందించిన గొప్ప కానుకని దీనిని నేటితరం విద్యార్థులకు అందించాలన్నదే తమ ఉద్దేశమని, విద్యార్థులు మొబైల్ ఫోన్లకి, సోషల్ మీడియాకు అంకితమవుతున్నారని, అందుకోసం మేధో శక్తి పెరగడానికి, జీవితంలోని ఎత్తుపల్లాలను  అంచనా వేయడానికి  చెస్ ఎంతోగాను ఉపయోగపడు తుందన్నారు.  రానున్న రోజులలో చెస్ బోర్డుల పంపిణీ  అన్ని ప్రభుత్వ పాఠశాలకు అందిస్తామన్నారు.

ఈ సందర్భంగా  దక్షిణ ప్రాంగణ ప్రిన్సిపల్  డాక్టర్ ఆర్ సుధాకర్ గౌడ్  మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు, ఆటలలో ప్రావీణ్యం పొందినట్లయితే  జీవితంలో ఉన్నత స్థానం సంపాదిస్తారని, మానసికంగా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. క్యాంపస్ లో చెస్ పోటీలు నిర్వహించి  విద్యార్థులను జాతీయస్థాయిలోకి తీసుకువెళ్తామన్నారు.

స్పోరట్స్ ఇంచార్జ్ డాక్టర్ బి అంజయ్య  మాట్లాడుతూ విద్యార్థులు ఖాళీ సమయంలో గేమ్స్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ క్యాంపస్  చెస్ క్లబ్  కోఆర్డినేటర్స్  డాక్టర్ టీ ప్రతిజ్ఞ, డాక్టర్ ఎస్ నారాయణ గుప్తా, ఫిజిక్స్ హెచ్ వో డి  డాక్టర్ మోహన్ బాబు, ఎన్‌ఎస్‌ఎస్  కోఆర్డినేటర్  డాక్టర్ హరిత , హాస్టల్ వార్డెన్ డాక్టర్ సునీత, ఏపీఆర్‌ఓ  డాక్టర్ సరిత, డా.శ్రీకాంత్, డా నిరంజన్ డా. ఇంద్రకరణ్ రెడ్డి, డా.పోతన్న, తదితరులు పాల్గొన్నారు.