calender_icon.png 4 December, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోటరీ క్లబ్ కామారెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవo

04-12-2025 01:30:23 AM

కామారెడ్డి, డిసెంబర్ 3 (విజయక్రాంతి): కామారెడ్డి లోని విఆర్కే జూనియర్ కళాశాలలో బుధవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రోటరీ క్లబ్ కామారెడ్డి ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ డాక్టర్ విట్టల్ ముదిరాజ్  మాట్లాడుతూ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరిని గౌరవించాలి అన్నారు.

దివ్యాంగులకు తగిన చేయూతనివ్వాలని ,తగిన సౌకర్యాలను అందించాలనే ఆలోచనతో రోటరీ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందన్నారు. దివ్యాంగుల అవసరాలను, వాళ్లకు కొన్ని సౌకర్యాలు కల్పించడానికి రోటరీ క్లబ్ ఎప్పుడు ముందుంటుందని అన్నారు.ఎంతోమంది దివ్యాంగులు ఉన్నప్పటికీ  వారిని మనలో ఒకరిగా భావించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంటుందని తెలిపారు.

అనంతరం  న్యాయవాదుల దినోత్సవం పురస్కరించుకొని ఓకేట్స్ డే ని నిర్వహించారు . ఈ కార్యక్రమంలో అడ్వకేట్ శ్యామ్ గోపాల్ , సూర్య ప్రసాద్ ని సన్మానించారు.  ప్రపంచ దివ్యాంగుల రోజును  పురస్కరించుకొని పోచవ్వ, నవీన్ రెడ్డి,మల్లయ్య, హఫీజ్ బేగం తదితరులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు శంకర్ , సెక్రెటరీ సబ్బాని కృష్ణ హరి విఆర్కే జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

గాంధారిలో..

గాంధారి, డిసెంబర్ 3 (విజయ క్రాంతి): గాంధారి మండల కేంద్రంలోని భవిత ప్రత్యేక పాఠశాలలో మంగళవారం జరిగినటువంటి దివ్యాంగుల ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థుల కు  ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మల్లేష్ చేతుల మీదుగా బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి మరియు వారికి సమాన అవకాశాలను కల్పించడంలో మద్దతు సమీకరించడం ఈ ఆట పోటీల యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు.

సమాజంలోని అన్ని రంగాలలో దివ్యాంగుల హక్కులు గౌరవం శ్రేయస్సు పట్ల అవగాహన పెంచడమే అని తెలిపారు.  ప్రతి పాఠశాలలో దివ్యాంగులను గుర్తించి వారికి తగిన సౌకర్యాలు కల్పించే విధంగా ప్రత్యేక ఉపాధ్యాయులు పెంటయ్య విజయ్ సాయన్న, శ్రీనివాసులు అందుబాటులో ఉంటామని తెలిపారు. దివ్యాంగులకు సంబంధించిన ప్రయోజనాలను తల్లిదండ్రుల ఆధ్వర్యంలో పొంది వారు సామాన్యులతో సమానంగా ఎదగాలని తెలిపారు. డాక్టర్ స్వాతి, దివ్యాంగులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

నాగిరెడ్డీపేట్ మండలంలో..

నాగిరెడ్డిపేట్,డిసెంబర్ 3 (విజయక్రాంతి):ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని భవిత సెంటర్లో సి.డబ్ల్యూ.ఎస్.ఎన్ పిల్లలకు మ్యూజికల్ చైర్, రన్నింగ్ రేస్,ఫ్రాగ్ జంప్ గేమ్స్ నిర్వహించారు .ఈ సమావేశంలో మండల ఇన్చార్జి విద్యాధికారి వెంకట్ రెడ్డి భవిత ద్వారా అందుతున్న సేవలు గురించి,  సిడబ్ల్యూఎస్‌ఎన్ సంక్షేమ పథకాలు,ఉపకరణాల పంపిణీ, వివిధ రకాల వైకల్యాల గురించి వివరించారు.

అనంతరం క్రీడల్లో గెలుపొందిన విజేతలకు  తల్లిదండ్రుల సమక్షంలో మండల ఇన్చార్జి ఎంఈఓ వెంకటరెడ్డి బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం.మాణిక్యంబ, సుమిత్ర, అఫ్రిన్, ఫిజియోథెరపిస్ట్ సవిత,  స్పెషల్ ఎడ్యుకేటర్ సంతోష్, ఐఈఆర్పి సుజాత, కంప్యూటర్ ఆపరేటర్ శైలంద్ర కుమార్, సిఆర్పిఎస్ రాజు, స్వామి, శంకర్, కవిత తదితరులు పాల్గొన్నారు.