18 April, 2026 | 4:44 PM

దవాఖానలో చేరిన సోనియాగాంధీ

16-06-2025 01:48 AM

ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు

న్యూఢిల్లీ, జూన్ 15: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ (78) ఆదివారం ఆసుపత్రిలో చేరారు. కడుపునొప్పి సంబంధిత సమస్యలతో ఆమె సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. సోనియా గాంధీకి గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్‌మెంట్‌లో చేరారని.. ఆమెకు చికిత్స అందిస్తున్నట్టు ఆసుపత్రి ఓ ప్రకటనను విడుదల చేసింది.