25 April, 2026 | 10:55 PM

తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ

09-12-2024 04:21 PM

మంథనిలో సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమా, పాక్స్ చైర్మన్ శ్రీనివాస్

మంథని (విజయక్రాంతి): తెలంగాణ 60 సంవత్సరాల ఆకాంక్షను నెరవేర్చిన తల్లి, సోనియా గాంధీ అని ఆమె జన్మదిన వేడుకల్లో మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాదేవి, పాక్స్ చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. సోమవారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొలు శివ ఆధ్వర్యంలో మంథనిలోని అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కటింగ్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచార కమిటీ చైర్మన్ ఒడ్నల శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజీమ్ ఖాన్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యంలతో కలిసి వారు మాట్లాడుతూ.. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని రాజకీయ ప్రకంపనలు వచ్చినా, అన్నింటినీ తట్టుకుని.. సోనియా గాంధీ తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, ఉద్యమకారుల 60 సంవత్సరాల ఆకాంక్షను నెరవేర్చారనీ కొనియాడారు. 

తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అయితే, ఆనాడు అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు బిల్లును ప్రవేశపెట్టి పార్లమెంటుకు పంపించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు శ్రీకాంత్, కౌన్సిలర్లు చొప్పకట్ల హనుమంతూ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కుడుదుల వెంకన్న, బండారి ప్రసాద్, గోటికారి కిషన్, పార్వతి కిరణ్, మండల మున్సిపల్, యూత్ కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.