ఉప్పల్ స్కైవాక్ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యయత్నం
09-12-2024 04:26 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): స్కైవాక్ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఫ్రాన్సిన్ అనే వ్యక్తి ఉప్పల్ లోని స్కైవాక్ పైనుంచి దూకడంతో స్వల్పంగా గాయాలయ్యాయి. స్కైవాక్ వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫ్రాన్సిన్ గమనించి స్థానికుల సహయంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఫ్రాన్సిస్ సంగారెడ్డిలోని భవానినగర్ వాసిగా గుర్తించారు. అతను మానసిక ఒత్తిడితోనే స్కైవాక్ పైనుంచి దూకినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలింది.






