25 April, 2026 | 9:24 PM

అసెంబ్లీ సమావేశాలు వాయిదా

09-12-2024 02:35 PM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. సమావేశాలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ నెల 16 తేదీకి వాయిదా వేశారు. సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదనను రాష్ట్ర మంత్రులు బలపర్చారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ప్రత్యేక అంశంగా నేతలు పేర్కొన్నారు. సగర్వంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రతిపక్షాలను ఆహ్వానించినట్లు వెల్లడించారు. ప్రధాన ప్రతిపక్షం హాజరు కాకుండా.. విగ్రహావిష్కరణను పరోక్షంగా అడ్డుకుంటున్నారని మంత్రి  శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. అటు తెలంగాణ అసెంబ్లీ నేడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు నడిచింది. మంత్రులు ప్రోటోకాల్ పాటించట్లేదు బీజేపీ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు నేతృత్వంలో బిఆర్‌ఎస్ శాసనసభ్యులు సోమవారం ఉదయం ఆకస్మిక నిరసనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సెషన్ ప్రారంభానికి నిమిషాల ముందు నిరసన చెలరేగింది. ఫలితంగా మండలి ప్రతిపక్ష నాయకుడు ఎస్ మధుసూధనా చారి,హరీష్ రావు,కవిత,ఇతరులతో సహా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్టు చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.బీఆర్ఎస్ శాసనసభ్యులు ‘రేవంత్-అదానీ భాయ్ భాయ్’ నినాదంతో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో పాటు రేవంత్ రెడ్డి ఉన్న ఫొటో టీ-షర్టుల ధరించి రావడంతో వివాదం మొదలైంది.