మధుయాష్కీని పరామర్శించిన సోనియాగాంధీ
28-06-2024 01:58 AM
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి) : టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్‌ను ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ పరామర్శించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో మధుయాష్కీగౌడ్‌తో సోనియాగాంధీ గురువారం భేటీ అయ్యారు. ఇటీవలే మధుయాష్కీ తల్లి అనసూయ పరమపదించారు. ఆమె మరణానికి గల కారణాలను సోనియాగాంధీ అడిగి తెలుసుకున్నారు. అనసూయ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ధైర్యంగా ఉండాలని మధుయాష్కీకి సూచించారు.




