5 April, 2026 | 6:27 PM

అక్రమ సంబంధం.. తండ్రిని చంపిన కొడుకులు

05-04-2026 11:58 AM

తండ్రిని చంపిన కొడుకులు

జయశంకర్ భూపాలపల్లి,(విజయక్రాంతి): వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తండ్రిని కొడుకులు చంపిన ఘటన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. మండలంలోని రేపాక గ్రామానికి చెందిన కుర్రె చేరాలు గ్రామంలో ఒంటరిగా ఉంటుండగా, అతడి భార్య కుమారుల వద్ద హైదరాబాద్లో ఉంటోంది. ఈక్రమంలో కుమారులు గ్రామానికి రాగా మరో మహిళతో ఉండటం గమినించి వారిద్దరిపై దాడి చేసినట్లు సమాచారం.

చేరాలుకు తీవ్ర గాయాలవడంతో వరంగల్ లోని ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాడి ఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధిత మహిళ పరకాల లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.