15 April, 2026 | 5:18 AM

పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

06-02-2026 01:50 AM

బెజ్జూర్ ,ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): బెజ్జుర్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, హాజరు రిజిస్టర్, శుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్‌ఓ సార్తజ్ పాషా, సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, మహిళలు, బాలికల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.