06-02-2026 01:50:02 AM
నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఘటన
ఖానాపూర్, ఫిబ్రవరి ౫(విజయక్రాంతి): తన ఎద్దులను, వ్యవసాయ భూమిని తనకు ఇప్పించాలని వేడుకుంటూ ఒక రైతు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో పొర్లుదండాలు పెట్టి అటవీ అధికారులకు విన్నవించుకున్న సంఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఖానాపూర్ మండలం లోని తర్లపాడు గ్రామ నివాసి రైతు బోసు భూమన్న అనే వ్యక్తి గత 40 సంవత్సరాలుగా పోడు వ్యవసా యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాన్నాడు.
అది అడవి భూమి అని పేర్కొంటూ ఇటీవల ఆ భూమిని అటువీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుని జేసీబీతో గుంతలు తవ్వి, సీసీ కెమెరాలు పెట్టి పర్యవేక్షిస్తున్నారు. ఈ విషయమై రైతు అధికారుల వద్దకు వెళ్లి గోడు వెళ్లబోసుకున్న ఫలితం లేదని, ఇదిలా వుం డగా ఇటీవల తను, తన భార్య వ్యవసాయ భూమి లో సాగు చేసుకుంటుండగా అటువీ అధికారులు తన జత ఎద్దులను తీసుకుపోయారు.
వాటిని విడిచిపెట్టమని ఎంత బతిమిలాడినా ఇవ్వడం లేదంటూ ఇటీవల కాలంలో తహసీల్దార్ ముందు తనను హాజరు పరిచి విడిచిపెట్టారని, తన ఎద్దులను విడిచిపెట్టమని ఎంత ప్రాధేయపడిన కరుణించడం లేదని పేర్కొంటూ సదరు రైతు పట్టణంలోని అంబేద్కర్ విగ్ర హం నుంచి సమీపంలో గల అటవీ కార్యాలయం వ రకు పొర్లుదండాలు పెట్టుకుంటూ నిరసన తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.