03-12-2025 12:00:00 AM
మహబూబాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ మంగళవారం మహబూబాబాద్ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లను సందర్శించి పరి శీలించారు. రికార్డులు, పెండింగ్ కేసులు, ఎన్ సీ ఆర్ పీ నమోదు వివరాలు, మహిళల భద్రత, పహారా విధానాలు, నైట్ బీట్ అమలు, రెస్పాన్స్ సమయం, సీసీ ఫుటేజ్ మానిటరింగ్ వంటి అంశాలను పరిశీలించారు.
రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికల దృష్ట్యా గ్రామలను సందర్శిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ఉండాలన్నారు. స్టేషన్కు వచ్చే ప్రజలకు సమయం వృథా కాకుండా, ఫిర్యాదులను తక్షణం స్వీకరించి పోర్టల్లో నమోదు చేయాలని ప్రతి కేసు పై పారదర్శకంగా, బాధ్యతతో పనిచేయాలన్నారు. పహారా, నైట్ రౌండ్స్, మహిళల భద్రత కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగాలని ఆదే శించారు.
స్టేషన్ పరిశుభ్రత, విజిలెన్స్, రికార్డుల అప్డేషన్, సోషల్ మీడియా స్పందనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. స్థానిక ప్రజలతో మాట్లాడి స్టేషన్ సేవలపై ఫీడ్బ్యాక్ తెలుసు కోవాలన్నారు. డిఎస్పీ తిరుపతి రావు, టౌన్ సీఐ మహేందర్ రెడ్డి, రూరల్ సీఐ సర్వయ్య, ఎస్.ఐ దీపిక ఉన్నారు.