03-12-2025 12:00:00 AM
ఎమ్మెల్యేకు సీపీఐ నేతల విజ్ఞప్తి
మహబూబాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మీ గెలుపుకు కృషి చేశాం, సర్పంచ్ ఎన్నికల్లో మాకు బలమున్న చోట మీరు మద్దతు ఇచ్చి మా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు సహకరించాలంటూ మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ కు సిపిఐ నేతలు విజ్ఞప్తి చేశారు.
ఈమెరకు మంగళవారం సిపిఐ నాయకులు మహబూబాబాద్ నియోజకవర్గంలో ముడుపుగల్, దామ్య తండ, కోరుకొండపల్లి గ్రామాల సర్పంచ్ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి అజయ్ సారథి రెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెరుగు కుమార్, రేశ పల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, జలగం ప్రవీణ్, గాదం శ్యాంప్రసాద్ యాదవ్, రమేష్ ఉన్నారు.