03-12-2025 12:00:00 AM
-భర్త మరణించడంతో పుట్టింట్లో ఆశ్రయం
-మనస్తాపంతో బలవన్మరణం
-మెదక్ జిల్లాలో ఘటన
చిన్నశంకరంపేట(చేగుంట), డిసెంబర్ 2(విజయక్రాంతి): రెండేళ్ల కొడుతో సహా త ల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో మంగళవారం చో టు చేసుకుంది. కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం ఖాజాపూర్ గ్రామానికి చెం దిన అఖిల(24)కు మూడు సంవత్సరాల క్రితం ప్రవీణ్‌తో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కొడుకు రియాన్స్ గౌడ్ ఉన్నాడు.
ఏడాది క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందడంతో కొడుకుతో తల్లిగారి ల్లు నార్సింగి మండలం సంకాపూర్ గ్రామం లో 8 నెలలుగా ఉండిపోయింది. కాగా సో మవారం అఖిల అత్త, బంధువులు సంకాపూర్ గ్రామానికి వెళ్లి ఆమెతో మాట్లాడి ఖా జాపూర్ గ్రామానికి తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం ఇంట్లో అఖిల తలుపులు పెట్టుకొని తీయకపోవడంతో స్థానికులు వ చ్చి తలుపులు తెరువగా కొడుకు రియాన్స్ గౌడ్‌తోపాటు అఖిల ఉరివేసుకొని ఆత్మహ త్య చేసుకున్నట్లు తెలిపారు.
విషయం తెలుసుకున్న రామాయంపేట సీఐ వెంకట రాజా గౌడ్, స్థానిక ఎస్.ఐ నారాగౌడ్ సంఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి, మృతురాలి మేనమామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా కొడుకుతో పాటు అఖిల మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.