9 April, 2026 | 3:11 AM

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి

09-04-2026 01:02 AM

గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ వంగవేటి రామారావు

కోదాడ, ఏప్రిల్ 8 : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ వంగవేటి రామారావు అన్నారు. కోదాడ పీఏసీఎస్ పరిధిలో తమ్మరబండపాలెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించి మాట్లాడారు. రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం కల్పించే మద్దతు ధర, బోనస్, ఇతర ప్రభుత్వ పథకాలను రైతులు ఉపయోగించుకోవాలన్నారు.

రైతులకు మేలు చేసేందుకు తమ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందన్నారు. కోదాడ పీఏసీఎస్ ఇన్చార్జి కామినేని పద్మజ మాట్లాడుతూ రైతుల కోసం బాలాజీనగర్, కొమరబండ, తొగర్రాయి, కూచిపూడిల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ఆర్డీఓ సూర్యనారాయణ, , తహశీల్దార్ వాజిద్ అలీ, కౌన్సిలర్ సామినేని రజిని నరేష్, గోపి, సుల్తాని సుజాత రాంబాబు, బత్తినేని హనుమంతరావు, సీఈఓ వెంకటేశ్వర్లు, కమతం వెంకటయ్య, రైతులు పాల్గొన్నారు.