28 April, 2026 | 4:28 AM

మహిళల భద్రతకు ‘స్పందన’

28-04-2026 01:59 AM
  1. ఒక్కో ఏసీపీ జోన్‌కు రెండు టీమ్‌ల కేటాయింపు
  2. మహిళలు భయం లేకుండా స్వేచ్ఛగా ఉండాలి 
  3. ఫిర్యాదు అందిన వెంటనే సంఘటనా స్థలికి..
  4. పోస్టర్ ఆవిష్కరణలో సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాం తి): తెలంగాణలో మహిళల భద్రత, ఆర్థి క సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులో వేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నా రు. మహిళలు, చిన్నారుల రక్షణ కో సం టీజీఐఐసీలో ఏర్పాటు చేసిన ‘స్పందన’ పోస్ట ర్‌ను సీఎం ఆవిష్కరించారు.  అత్యవసర పరిస్థితుల్లో మహిళలు, చిన్నారులకు వేగంగా రక్షణ కల్పించడమే ఈ టీమ్‌ల ప్రధా న ఉద్దేశమని సీఎం తెలిపారు. నగరంలో మహిళ లు భయం లేకుండా తిరిగే వాతావరణం ఉండాలన్నారు.

మహిళల భద్రతే స్పందన టీమ్‌ల ప్రధాన ధ్యేయమని, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా వీటిని ఏర్పా టు చేశామన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే సం ఘటనా స్థలానికి చేరుకుని బాధిలకు భరోసా కల్పిస్తారని, ఏ చిన్న ఆపద వచ్చినా ఫిర్యాదు చేయడానికి వెనుకాడొద్దని సీఎం పిలుపునిచ్చారు.

ఇప్పటికే మహిళల రక్షణ కోసం షీటీమ్స్‌ను ఏర్పాటు చేసుకున్నామని, అభద్రతకు గురైన మహిళలకు అండగా ఉండాలని స్టాండ్ విత్ హర్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నామని, మరో అడుగు ముందుకు వేసి స్పందన పేరుతో 24గంటల పాటు అం దుబాటులో ఉండేలా టీమ్స్‌ను ఏర్పాటు చేశాం’ అని అన్నారు. బాధితుల పట్ల ఎలా వ్యవహారించాలి, నింధితులను ఎలా అదు పు చేయాలనే అంశంపై స్పందన సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

ఒక్కో ఏసీపీ జోన్‌కు రెండు స్పందన టీమ్‌లను కేటాయించినట్లు తెలిపారు. ఈ టీమ్‌లను డయల్ 100/112 లో అనుసంధానమై నిరంతరం అందుబాటులో ఉంటాయన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు, పిల్లలకు భద్రత, రక్షణ కల్పించడం ప్రభుత్వాలు బాధ్యతగా భావిస్తాయని, ఏ దేశాల్లో పిల్లలు, మహిళలకు రక్షణ కల్పిస్తున్నారో అక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే మహిళలకు ఓటు హక్కు కల్పించారని, అమెరికాలో మహిళలకు ఓటు హక్కు ఇవ్వడానికి 150 ఏళ్లు పట్టిందన్నారు. దేశం అభివృద్ధిలో మహిళలకు పురుషుల తోపాటు నెహ్రూ సమాన హక్కులు కల్పించారని వివరించారు. దేశ ప్రధానిగా, లోక్ సభ స్పీకర్‌గా, రాష్ట్రాల గవర్నర్లు, న్యాయమూర్తులుగా మహిళలకు కాంగ్రెస్  అవకా శం ఇచ్చిందన్నారు.

మహిళా విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థల్లో కూడా మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చి పరిపాలనలో కాంగ్రెస్ భాగస్వాములను చేసిందని వివరించారు. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ల కోసం 2013 లోనే బిల్లును కాంగ్రెస్ ఆమోదించిందదన్నారు. సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్లతో పాటు 67 లక్షల మంది స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ.60వేల కోట్ల బ్యాంక్ రుణాలను అందజేసినట్లు సీఎం పేర్కొన్నారు.

కోటీ మంది మహిళలకు సారె పేరుతో ఇందిరమ్మ చీర లు ఇచ్చామని, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించామని, స్వయం సహాయక సంఘాలకు 1000 బస్సులు కొనిచ్చామని చెప్పా రు. ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తులను అమ్మేలా అమెజాన్‌తో ఒప్పందం చేసినట్లు చెప్పారు. 2034 నాటికి వన్ ట్రిలియన్, 20247 నాటికి ౩ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టు కుందని ఇది జరగాలంటే మహిళలకు భద్రతతోపాటు సమాజంలో మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలన్నారు. 

డ్రగ్స్‌తో యువత నిర్వీర్యం.. 

 ఎంత ఆర్థిక ప్రగతి సాధించినా పిల్లలు సరైన దారిలో నడవకపోతే అంతా వృథా అ ని, పంజాబ్ లాంటి రాష్ట్రంలో మన కళ్ల ముందే డ్రగ్స్ వల్ల యువత నిర్వీర్యమైందని రేవంత్‌రెడ్డి తెలిపారు.  వ్యసనాలబారిన పడి ఆ రాష్ట్రం కోలుకోనిస్థితిలో ఉందని, స్కూల్స్ ముందు చిన్నచిన్న దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారన్నారు. మత్తుకు బానిసలైన వారు, గంజాయి తీసుకుంటున్న వారే ఎక్కు వ మంది మహిళలు, చిన్న పిల్లలపైన అకృత్యాలకు పాల్పడుతున్నారని చెప్పారు.

ఈగల్ ఫోర్స్‌తో డ్రగ్స్‌పై కఠినంగా వ్యవహారిస్తోందని, సెలబ్రేటీల్స్ ఉన్నా, ప్రజా ప్రతినిధులు ఉన్నా వదలకుండా అరెస్టు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ అంటే మహిళల రక్షణకు పర్యాయ పదంగా తీర్చిదిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, డీజీపీ శివధర్‌రెడ్డి, నగర సీపీ వీసీ సజ్జనార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.