28 April, 2026 | 4:30 AM

తెలంగాణ సాధనలో బీఆర్‌ఎస్ పాత్ర చరిత్రాత్మకం

28-04-2026 02:00 AM

బీఆర్‌ఎస్ పార్టీ జిల్లాధ్యక్షులు తోట ఆగయ్య

సిరిసిల్ల,ఏప్రిల్ 27,(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బిఆర్‌ఎస్ పార్టీ జెండాను ఘనంగా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగన్న పాల్గొని పార్టీ శ్రేణులు, ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా తోట ఆగన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో బిఆర్‌ఎస్ పార్టీ పాత్ర చారిత్రాత్మకమని అన్నారు.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, అభివృద్ధి, సంక్షేమమే పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పార్టీ స్థాపన నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న బిఆర్‌ఎస్ భవిష్యత్తులో కూడా ప్రజల పక్షాన నిలబడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జిందం కళ చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మాజీ జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, సీనియర్ నాయకులు కుంబాల మల్లారెడ్డి, బొల్లి రామ్మోహన్, మ్యాన రవి, కౌన్సిలర్లు, వివిధ మండలాల సర్పంచులు, సెస్ డైరెక్టర్లు, మాజీ ప్యాక్స్ చైర్మన్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.