30 June, 2026 | 3:21 AM

కెమిస్ట్రీతో స్పార్క్

04-08-2024 12:44 AM

దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది గోట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ థర్డ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. స్పార్క్ పేరుతో శనివారం విడులైన ఈ పాటకు యవన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ ను మ్యూజిక్ డైరెక్టర్ యువన్, వృష బాలు ఆలపించారు. ఈ పాటలో విజయ్ చౌదరి కెమిస్ట్రీ పండింది. ముఖ్యంగా విజయ్ డ్యాన్స్ ఆకట్టుకుంటోంది.